Home /News /crime /

GROOM FATHER SUES PHOTOGRAPHER IN CONSUMER COURT FOR NOT FOLLOWING DEAL BEFORE MARRIAGE IN BENGALORE HSN

ఇదో విచిత్ర కేసు.. ఫొటోగ్రాఫర్ కు షాకింగ్ అనుభవం.. పెళ్లికి రెడీ అవుతున్న యువకులంతా తప్పక తెలుసుకోవాల్సిన కేసు ఇది..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లిలో భాగంగా జరిగే అన్ని సంప్రదాయ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను తీసేందుకు ఓ ఫొటోగ్రాఫర్ తో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. కానీ ఒక చిన్న పొరపాటుతో కొన్ని కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు మిస్సయ్యాయి.

    పెళ్లి వేడుక. జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే మధుర ఘట్టం. ఈ పెళ్లి వేడుకలో భాగంగా జరిగే ప్రతీ ఒక్క కార్యాన్ని ఎంతో పవిత్రంగా పాటిస్తుంటారు. నలుగు దగ్గర నుంచి రిసెప్షన్ వరకు, అన్ని మధుర క్షణాలను ఫొటోల్లో భద్రపరుచుకోవాలని భావిస్తుంటారు. అందుకే ఈ తరం యువత ఫొటోగ్రఫీకి అధిక ప్రధాన్యం ఇస్తోంది. ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి పోస్ట్ వెడ్డింగ్ షూట్ వరకు ఫొటోలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తోంది. ఓ యువకుడి తండ్రి కూడా అదే పనిచేశాడు. పెళ్లిలో భాగంగా జరిగే అన్ని సంప్రదాయ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను తీసేందుకు ఓ ఫొటోగ్రాఫర్ తో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. కానీ ఒక చిన్న పొరపాటుతో కొన్ని కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు మిస్సయ్యాయి. అంతే అతడికి ఆగ్రహం తన్నుకొచ్చింది. అది కాస్తా వినియోగదారుల ఫోరం దాకా వెళ్లింది. చివరకు ఏం జరిగిందంటే..

    కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని శాంతినగర్ కు చెందిన 59 ఏళ్ల దత్తాత్రేయ భట్ అనే వ్యక్తి తన కుమారుడి పెళ్లి కోసం ఓ ప్రముఖ ఫొటో గ్రాఫర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2019వ సంవత్సరంలో ఏప్రిల్ 26, 27, 28వ తారీఖుల్లో మూడు రోజలు పాటు జరిగే సంప్రదాయ పెళ్లి కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ఫొటోలను తీసేలా డీల్ కుదుర్చుకున్నాడు. అందుకు గానూ 2.5 లక్షలకు మాట్లాడుకుని, 1.5 లక్షల రూపాయలను అడ్వాన్స్ రూపంలో ఇచ్చాడు. అనుకున్నట్టుగానే ఆ మూడు రోజుల పాటు ఫొటోగ్రాఫర్ వచ్చి పెళ్లి వేడుకను షూట్ చేశాడు. మంచి మంచి యాంగిల్స్ లో ఫొటోలు కూడా తీశాడు. అయితే చివరకు కేవలం కొన్ని కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను మాత్రమే ఇచ్చాడు.

    ఇదేంటని నిలదీస్తే ‘మేం అన్ని ఫొటోలను తీశాం. మీరు కూడా చూశారు కూడా. కానీ ఆ ఫొటోలను భద్రపరిచిన ల్యాప్ ట్యాప్ పాడయిపోయింది. అందులో ఉన్న డేటా అంతా పోయింది. అందువల్లే ఆ ఫొటోలను ఇవ్వలేకపోయాం. క్షమించండి‘ అని కోరాడు. అయితే వరుడి తండ్రి మాత్రం ఆ ఫొటోగ్రాఫర్ మాటలతో ఏకీభవించలేకపోయాడు. ‘పెళ్లంటే జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే మధుర క్షణం. అలాంటిది ముందుగానే డీల్ కుదుర్చుకున్నా. అయినప్పటికీ కోరుకున్న విధంగా ఫొటోలను ఇవ్వలేకపోయాడు‘ అంటూ వినియోగదారుల ఫోరంలో 2020వ సంవత్సరం మార్చి 10న ఫిర్యాదు చేశాడు. 12 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత మార్చి 6వ తారీఖున వినియోగదారుల ఫోరం తుది తీర్పును వెల్లడించింది. ఫొటోగ్రాఫర్ నిర్లక్ష్యం ఉందనీ, బాధితుడికి 55వేల రూపాయల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. నెలలోగా ఆ జరిమానాను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, Marriage, Photography

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు