Home /News /crime /

GROOM DIED SUDDENLY AFTER THE MARRIAGE A BIG TRAGEDY IN MARRIAGE HOUSE IN BIHAR AK

Groom: పెళ్లి పూర్తయ్యింది.. బరాత్ మొదలైంది.. మరికొన్ని నిమిషాల్లోనే అత్తారింట్లో అడుగుపెట్టనున్న కొత్త పెళ్లి కూతురు.. కానీ ఇంతలోనే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చరద్వాలి గ్రామానికి చెందిన చందేశ్వర్ గిరి ఏకైక కుమారుడు మనీష్ గిరి వివాహం యోగాపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమేథియా గ్రామానికి చెందిన చందాతో నిశ్చయమైంది. సోమవారం మనీష్ ఊరేగింపుతో అమేథియా గ్రామానికి వచ్చాడు.

  విధిని ఎవరూ మార్చలేరు. విధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే ఊహించని కొన్ని పరిణామాలు తీవ్ర విషాదం నెలకొనేలా చేస్తుంటాయి. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలో ఇలాంటి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒక కుటుంబం చాలా ప్రేమతో తమ కుమార్తెను పంపింది. అయితే వారి ఆనందం ఆవిరి కావడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు. పెళ్లయిన కొన్ని గంటలకే ఊహించని విధంగా వరుడు చనిపోయాడు. ఈ సమాచారం అందిన వెంటనే ఇరు కుటుంబాల్లో తీరని దు:ఖం నెలకొంది. కాసేపటి క్రితం పెళ్లి భాజాలు మోగిన చోట... రోదనలు మిన్నంటాయి. వివాహానంతరం వధువుతో ఊరేగింపు ఆమె ఇంటికి చేరుకోగానే, వరుడు అకస్మాత్తుగా తల తిరిగి పడిపోయాడు. నిద్రలేమి కారణంగా అతడు అలా స్పృహ తప్పిపడిపోయాడని అంతా అనుకున్నారు. వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే వరుడు చనిపోయాడు.

  డాక్టర్ ఈ విషయంలో చెప్పడంతో.. అక్కడున్న వాళ్లకు ఏం జరిగిందో కొన్ని నిమిషాల వరకు అర్థంకాలేదు. తాము విన్నది నిజమే అని తెలియడానికే వాళ్లకు కొంత సమయం పట్టింది. ఎంతో గొప్పగా అలంకరణలతో ముస్తాబయిన వధువు కొద్ది క్షణాల్లోనే వితంతువుగా మారిపోయింది. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.ఈ సంఘటన రాష్ట్రంలోని సతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛరద్వాలి బసంత్‌పూర్ గ్రామంలో జరిగింది.

  చరద్వాలి గ్రామానికి చెందిన చందేశ్వర్ గిరి ఏకైక కుమారుడు మనీష్ గిరి వివాహం యోగాపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమేథియా గ్రామానికి చెందిన చందాతో నిశ్చయమైంది. సోమవారం మనీష్ ఊరేగింపుతో అమేథియా గ్రామానికి వచ్చాడు. వధూవరుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లికి ముందు వరుడు మనీష్‌కు కళ్లు తిరగడంతో అక్కడ ఉన్నవారు ఏదో మందు ఇచ్చారు. దీంతో అతడి ఆరోగ్యం మెరుగుపడింది.

  అర్థరాత్రి మూడు గంటలకల్లా కళ్యాణ ముహూర్తాలన్నీ పూర్తయ్యాయి. ఆనందంగా ఆమె ఇంటి నుంచి భరాత్ బయలుదేరింది. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో మనీష్ పెళ్లికూతురుతో కలిసి తన ఇంటికి చేరుకున్నాడు. వధువును కారులో నుంచి దించే క్రతువు మొదలైంది. వధూవరులు కారు దిగి ఇంటికి వెళ్లడం ప్రారంభించిన వెంటనే మనీష్‌కి మళ్లీ కళ్లు తిరగడంతో అక్కడే పడిపోయాడు. హడావుడిగా బంధువులు మనీష్‌ను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. మనీష్ ఆకస్మికంగా ఎలా చనిపోయాడో ఏమీ తెలియరాలేదు. గుండెపోటుతో మృతి చెందినట్లు చెబుతున్నారు.

  Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్‌.. ఆ తరువాతే అమలు చేస్తారా ?

  KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?

  Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం

  Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

  పెళ్లయిన కొద్ది గంటల్లోనే వరుడు మృతి చెందడం ఆ కుటుంబంలో కలకలం రేపింది. అదే సమయంలో ఆ ప్రాంత ప్రజలు కూడా షాక్‌కు గురవుతున్నారు. పెళ్లి కుమారుడి ఇంటికి అతడే పెద్ద దిక్కు. ఒంటికాలితో నిస్సహాయ స్థితిలో ఉండి ఏమీ చేయలేక పోయాడు. కానీ అతని తల్లిదండ్రులు అతని వివాహం గురించి చాలా కలలు కన్నారు. అది చివరి క్షణంలో విచ్ఛిన్నమైంది. మృతదేహంతో బంధువులు ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో కొన్ని గంటల క్రితం పెళ్లికూతురుగా మారిన చందా కూడా షాక్ కారణంగా ఆస్పత్రిలో చేరింది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Marriage

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు