GROOM COMMITS SUICIDE ON SECOND DAY OF MARRIAGE IN KHAMMAM DISTRICT SNR KMM
OMG: ఖమ్మం జిల్లాలో పెళ్లి చేసుకున్న 48గంటల్లోనే గొంతుకోసుకున్న పెళ్లి కొడుకు .. ఎందుకంటే
(పెళ్లైన 48గంటల్లోనే ..)
OMG: ఖమ్మం జిల్లాలో పెళ్లి జరిగిన ఇంట్లోనే విషాదం నెలకొంది. వివాహం జరిగి 48గంటలు పూర్తి కాలేదు. పెళ్లికి వచ్చిన బంధువులు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. ఈసమయంలోనే పెళ్లి కొడుకు బాత్రూంలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం అందర్ని షాక్‌కి గురి చేసింది.
(G.SrinivasReddy,News18,Khammam)
కొత్త పెళ్లి కొడుకు ప్రాణాలు తీసుకున్నాడు. వివాహం జరిగిన 48గంటల్లోపే చనిపోయాడు. బంధువులు, కుటుంబ సభ్యులు ఇంకా ఆనందంలో ఉండగానే విషాద వార్త అందర్ని షాక్‌కు గురి చేసింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న నవవరుడు..ఎందుకింత పని చేశాడో ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్న యువకుడు షడన్‌గా తీసుకున్న నిర్ణయానికి తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఖమ్మం(Khammam)జిల్లాలో కొత్త పెళ్లి కొడుకు(Groom)డెత్ కేసు సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా వైరా(Wyra) మండలం పుణ్యపురం(Punyapuram)గ్రామానికి చెందిన కమ్మపాటి ఇజ్రాయేల్( Kammapati Israel)కుమారుడు నరేష్(Naresh)సోమవారం (Monday)తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో బాత్రూంలో చేతి మణికట్టు(Hand wrist), గొంతు(Throat)ని బ్లేడ్bladeతో కోసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
పెళ్లి వారింట్లో చావు మేళం..
నరేష్‌కి ఈనెల 4వ తేదిన ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఆరళ్లపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. మరుసటి రోజు అనగా ఆదివారం రిసెప్షన్ నిర్వహించారు. పెళ్లి, రిసెప్షన్లో ఎంతో సంతోషంగా గడిపిన నరేష్ సోమవారం విజయవాడలోని గుణదల టెంపుల్‌కి వెళ్లే ముందు ఇంట్లోనే ప్రాణాలు తీసుకోవడం రెండు కుటుంబాల సభ్యుల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
పెళ్లైన రెండో రోజే సూసైడ్..
అందరూ విజయవాడ గుడికి వెళ్లేందుకు తయారు అవుతున్న సమయంలో నరేష్ స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్లాడు. అందులోంచి ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాత్రూం డోర్ పగలగొట్టడంతో లోపల రక్తపు మడుగులో పడివున్నాడు నరేష్. చేతి మణికట్టు, గొంతు బ్లేడుతో కోసుకున్నట్లుగా గుర్తించారు. తీవ్రరక్తస్త్రావం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పెళ్లి జరిగి రెండ్రోజులు కూడా గడవక ముందే బిడ్డ రక్తపు మడుగులో విగతజీవిగా పడివుండటం చూసిన నరేష్ తల్లి కన్నీటిపర్యంతమైంది.
చావు వెనుక సందేహాలు..
మృతుడు నరేష్ బీటెక్ నరేష్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. పెళ్లి నిశ్చయం కావడంతో గత 6నెలలుగా గ్రామంలోనే ఉంటున్నాడు. తండ్రి లేకపోవడంతో నరేష్‌ని తల్లే చదివించి వివాహం జరిపించింది. నరేష్‌కి సోదరుడు ఉన్నాడు. అతనికి వివాహం అయిపోయింది. నరేష్ ఆత్మహత్య చేసుకోవడానికి కుటుంబం పరంగా ఎలాంటి సమస్యలు లేవని బలవన్మరణం చేసుకోవడానికి గల కారణాలు ఏమిటో ఎవరితో చెప్పులేదని తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు వైరా పోలీసులు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేశారు. బంధు, మిత్రులను అడిగి మరిన్ని వివరాలు సేకరించారు. కొత్తగా పెళ్లి కొడుకు ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఫోన్ డేటా, కాల్ డేటాను సేకరించారు. మృతునికి అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితుల ద్వారా కూడా అదనపు సమాచారం రాబడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.