హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking : పెళ్లి అయిన 36 రోజులకే యువకుడు ఆత్మహత్య...ఎందుకో తెలుసా!

Shocking : పెళ్లి అయిన 36 రోజులకే యువకుడు ఆత్మహత్య...ఎందుకో తెలుసా!

ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ఆత్మహత్య చేసుకున్న యువకుడు

 Groom commited sucide : ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని గదలోత్ గ్రామంలో పెళ్లైన 36 రోజులకే గౌరవ్‌(22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లయ్యాక భార్యతో కలిసి ఢిల్లీ వెళ్లిన అతడు హఠాత్తుగా ఆమెను అక్కడే వదిలేసి స్వగ్రామానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంకా చదవండి ...

Groom commited sucide : ఉత్తరప్రదేశ్‌(UttarPradesh)లోని ఇటావా జిల్లాలోని గదలోత్ గ్రామంలో పెళ్లైన 36 రోజులకే గౌరవ్‌(22) అనే యువకుడు ఆత్మహత్య(Sucide) చేసుకున్నాడు. పెళ్లయ్యాక భార్య(Wife)తో కలిసి ఢిల్లీ వెళ్లిన అతడు హఠాత్తుగా ఆమెను అక్కడే వదిలేసి స్వగ్రామానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతే కాదు ఆ యువకుడి తర్వాత ఆ గ్రామంలో ఓ అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్ కృష్ణ పటేల్ మాట్లాడుతూ...వారిద్దరి మధ్య ప్రేమాయణం ఉందని తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న గౌరవ్‌కు మే 15న వివాహమై ఢిల్లీలో నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం నాడు ఢిల్లీ నుంచి తిరిగి గ్రామానికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం ఏదో పని నిమిత్తం వెళతానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీని తర్వాత, బంధువులు వెతకగా, గ్రామంలోని బావి దగ్గర ఒక యువకుడి చెప్పులతో సహా కొన్ని వస్తువులన కనుగొన్నారు. దీంతో గ్రామస్థులు అక్కడికి చేరుకుని చూడగా బావిలో మృతదేహం పడి ఉంది. అదే సమయంలో గౌరవ్ మరణవార్త విని గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఇద్దరి ఆత్మహత్యల వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని చెబుతున్నారు. 22 ఏళ్ల గౌరవ్ మృతదేహం బావిలో పడి ఉందని భర్తన పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ పటేల్ తెలిపారు. కాగా యువకుడి మృతి తర్వాత గౌరవ్ సొంతూరులోనే ఉంటున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. గౌరవ్ ఇంటికి 50 మీటర్ల దూరంలో బాలిక ఇల్లు ఉందని చెబుతున్నారు. యువకుడి ఆకస్మిక మృతితో భార్య, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా గ్రామస్తుల సమాచారంతో చేరుకున్న పోలీసులు బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు.

ముందుంటదిలే బాసు అసలు పెళ్లి : ఇద్దరమ్మాయిల మెడలో తాళి కట్టిన వరుడు!

యువకుడి మామ

మే 15న తన 22 ఏళ్ల మేనల్లుడు గౌరవ్‌కు వివాహం జరిగిందని యువకుడి మేనమామ మహరాజ్ సింగ్ తెలిపారు. పెళ్లయిన కొద్దిరోజులకే భార్యను తీసుకుని కూలీ పనులు చేసుకుంటూ ఢిల్లీలో ఉంటున్న తన బావ ఇంటికి వెళ్లాడు. కాగా, గౌరవ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి ఇంటికి చేరుకుని రాత్రి భోజనం ముగించుకుని రాత్రి 11 గంటలకు గ్రామంలో వాకింగ్‌కు బయలుదేరాడు. అదే సమయంలో గౌరవ్ సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో అతని తల్లి కుసుమదేవి, మామ కమలేష్, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో అందరూ ఆ యువకుడి కోసం వెతకడం ప్రారంభించారు. అర్థరాత్రి గౌరవ్ మృతదేహం గ్రామానికి 100 మీటర్ల దూరంలోని పొలాల్లో నిర్మించిన బావిలో పడి ఉంది. కాగా అతని టవల్, చెప్పులు, మొబైల్ బావి బయట పడి ఉన్నాయి. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

యువకుడు, యువతి మధ్య ప్రేమ వ్యవహారం ఉందా?

అయితే, పోస్టుమార్టం నిమిత్తం గౌరవ్ మృతదేహంతో గ్రామానికి కొద్దిదూరంలో పోలీసులు చేరుకోగానే, యువకుడి ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉన్న తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తున్న 19 ఏళ్ల సాధన ఆత్మహత్య చేసుకుంది. తండ్రి చనిపోవడంతో చిన్నప్పటి నుంచి తల్లి రాధతో కలిసి సాధన ఇంట్లోనే ఉంటున్నట్లు మృతురాలి తాతయ్య సలీగ్ నాథ్ తెలిపారు. పెళ్లి, ఇతర కార్యక్రమాల్లో పూరీలు తయారు చేసేందుకు సాధన తల్లి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లింది. దీంతో సాధన ఇంట్లో ఒంటరిగా ఉంది. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు,తను చనిపోయి ఉందని తెలిపాడు. సాధనకు ఫిబ్రవరి 15, 2023న వివాహం జరగనుందని మృతుడి తాతయ్య తెలిపారు. అదే సమయంలో సాధన మరణవార్త విన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడు గౌరవ్, మృతురాలు సాధన ఒకరికొకరు బాగా తెలుసునని గ్రామస్తులు తెలిపారు.

First published:

Tags: After marriage, Crime news, Love affair, Uttar pradesh

ఉత్తమ కథలు