Home /News /crime /

GROOM ALONG WITH HIS FAMILY HAVE LODGED A COMPLAINT WITH THE POLICE AGAINST THE WOMAN FAMILY FOR CHEATING SSR

Sad: ఇంత దగ్గరయ్యావు కదమ్మా.. ఇంతలోనే ఇదేం ట్విస్ట్.. ఇలా చేస్తే ఆ అబ్బాయి పరిస్థితేంటి..

చిన్నతంబి, అభినయ

చిన్నతంబి, అభినయ

పెళ్లి చేసుకుంటానని ముఖం చాటేసిన అబ్బాయిల ఇంటి ముందు యువతులు ధర్నాలు చేసిన ఘటనల గురించి విని ఉంటారు. పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేసే నిత్య పెళ్లి కొడుకుల గురించి కూడా చూసి ఉంటారు.

    చెన్నై: పెళ్లి చేసుకుంటానని ముఖం చాటేసిన అబ్బాయిల ఇంటి ముందు యువతులు ధర్నాలు చేసిన ఘటనల గురించి విని ఉంటారు. పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకుల గురించి కూడా చూసి ఉంటారు. కానీ.. నిశ్చితార్థం జరిగిన తర్వాత తనతో పెళ్లికి యువతి, యువతి కుటుంబం అంగీకరించడం లేదని యువకుడు, అతని కుటుంబం పోలీసులను ఆశ్రయించిన ఘటన తమిళనాడులోని మయిలదుతురై జిల్లాలో చోటుచేసుకుంది.

    ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మయిలదుతురై జిల్లాలోని కిలియనూరుకు చెందిన చిన్నతంబి అనే 28 ఏళ్ల యువకుడికి, విలియనల్లూరుకు చెందిన మురుగన్ కుమార్తె అభినయ(18)తో జూన్ 28న నిశ్చితార్థం జరిగింది. తనకు కాబోయే భార్యకు చిన్నతంబి బంగారు గొలుసు చేయించి ఇచ్చాడు. ఆమెకు 13 వేల రూపాయల విలువ చేసే స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు. అభినయ తండ్రికి బైక్ లేకపోవడంతో బాగా ఇబ్బందిగా ఉందని కాబోయే భార్య చెప్పడంతో కాబోయే మామకు చిన్నతంబి బైక్ కొనిపెట్టాడు. ఇలా చిన్నతంబి, అభినయ రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు. కూతురి చదువు ఈ సంవత్సరం పూర్తవుతుందని.. వచ్చే సంవత్సరం ఆరంభంలో మంచి ముహూర్తం చూసి పెళ్లి పెట్టుకుందామని అభినయ తల్లిదండ్రులు చిన్నతంబి కుటుంబానికి చెప్పారు. దీంతో.. అభినయ తమకు కాబోయే కోడలని చిన్నతంబి తల్లిదండ్రులు కూడా భావించారు. కానీ.. అభినయ కుటుంబం నవంబర్ 15న చిన్నతంబికి ఊహించని షాకిచ్చింది. తమ కూతురు కనిపించకుండాపోయిందని, ఆమె కోసం వెతుకుతున్నామని చెప్పింది. దీంతో.. కంగారుపడిన చిన్నతంబి ఆమెకు ఫోన్ చేయగా.. ఒకసారి కాల్ లిఫ్ట్ చేసిన అభినయ.. తాను ఇక ఎప్పటికీ రానని.. మరో అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పింది. తన తల్లిదండ్రులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలిపింది. ఆ మాట చెప్పి కాల్ కట్ చేసింది.

    ఇది కూడా చదవండి: Marriage: ఈ ఇద్దరూ లెక్చరర్లు.. అతని వయసు 38.. ఆమె వయసు 41.. వీళ్ల మేటర్ హాట్ టాపిక్ ఎందుకయిందంటే..

    అప్పటి నుంచి ఆమె కాల్ కలవడం లేదు. దీంతో.. తండ్రీకూతురు కలిసి తనను డబ్బు కోసం మోసం చేశారని చిన్నతంబి గ్రహించాడు. తనతో నిశ్చితార్థం అయిన తర్వాత ఆ యువతి పెళ్లికి నిరాకరిస్తోందని, ఆమె కుటుంబం కూడా ఆ యువతిని తనకు ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధంగా లేదని.. తనను మోసం చేశారని చిన్నతంబి, అతని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆ యువతి తండ్రిని ఊరి పెద్దలు ఇదేంటని నిలదీయగా.. తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తామని చెప్పడం కొసమెరుపు. తమ వద్ద నుంచి తీసుకున్న డబ్బును పూర్తిగా తిరిగిచ్చేలా చేయాలని చిన్నతంబి కుటుంబం డిమాండ్ చేసింది. తమ కొడుకును పెళ్లి పేరుతో మోసం చేశారని.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Cheating, Crime news, Marriage, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు