ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh) నోయిడాలోని ఒక అపార్ట్ మెంట్ లో దారుణమైన సంఘటన జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉన్న అజ్నారా లే గార్డెన్ హౌసింగ్ సొసైటీ లో ఒక ఆగంతకుడు ప్రవేశించాడు. అక్కడే ఉన్న మెట్ల పై నుంచి మహిళలు బాత్రూమ్ లో స్నానాలు చేస్తుండగా తన సెల్ ఫోన్ లో రికార్టు చేశాడు. దీంతో ఈ ఘటనపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పూర్తి వివరాలు.. నోయిడాలోని స్థానిక అపార్ట్ మెంట్ లో ఒక యువకుడు ప్రవేశించాడు. ఆ తర్వాత.. అక్కడ ఉన్న బిల్డింగ్ మెట్లపై నుంచి సీక్రెట్ గా మహిళలు బాత్రూమ్ లో ఉండగా సెల్ ఫోన్ లో బంధించాడు. ఆ తర్వాత.. అక్కడి నుంచి పారిపోయేవాడు. కొందరు మహిళలు దీన్ని గుర్తించి అపార్ట్ మెంట్ కమిటీ కి ఫిర్యాదు చేశారు. వారు అక్కడే ఉన్న సీసీ కెమారాను పరిశీలించారు.
సీసీ కెమెరా రికార్డులను పోలీసులకు ఇచ్చారు. అయిన వారు.. నిందితుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత.. అజ్నారా హౌసింగ్ సొసైటీ సభ్యులు మార్కెట్ వెళ్లినప్పుడు నిందితుడు అక్కడ కన్పించాడు. వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని అదుపులోనికి తీసుకొని స్టేషన్ తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఉత్తర ప్రదేశ్ లోని (uttar pradesh) నోయిడాలో మరో దారుణం జరిగింది.
ఒక మహిళ తన స్నేహితుడితో కలిసి రాత్రి పూట పార్కుకు వెళ్లింది. అక్కడ కొంత మంది ఆకతాయిలు ఉన్నారు. అయితే, తన స్నేహితుడు ముందస్తు ప్రణాళికతో అత్యాచారం జరిగినట్లు మహిళ ఫిర్యాదు చేసింది. నోయిడాలోని (Park) పార్కులో.. మహిళ, తన స్నేహితుడు రంజిత్ తో కలిసి సరదాగా వెళ్లింది. అక్కడ అప్పటికే పంకజ్, పవన్ అనే మరో వ్యక్తి ఉన్నారు. వారు మహిళను బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత మహిళ వారు అక్కడి నుంచి పారిపోయారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత.. బాధితురాలు తన ఇంట్లో వారికి జరిగిన విషయాన్ని తెలిపింది. ఈ క్రమంలో.. బాధితురాలు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పంకజ్,రంజీత్ లను అరెస్టు చేశారు. మరోక నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు ఘజియాబాద్ కు చెందిన వారిగా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Female harassment, Uttar pradesh