ఓ వ్యక్తి తమ పక్కింట్లో నివసించే 13 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె కాళ్లు, చేతులు కట్టేసి రూమ్లో పడేసి, బయట తాళం పెట్టి పారిపోయాడు. గ్రేటర్ నోయిడాలో ఈ దారుణం జరిగింది. గ్రేటర్ నోయిడాలోని బిస్రాక్ ప్రాంతంలో ఓ భవనం ఉంది. ఆ భవనంలో పలు పోర్షన్లు ఉన్నాయి. అందులో ఒక దాంట్లో నిందితుడు నివసిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం సమయంలో నిందితుడు అదే భవనంలో నివసిస్తున్న 13 సంవత్సరాల బాలికను బలవంతంగా తన గదిలోకి ఈడ్చుకొచ్చాడు. ఆమె మీద లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను లోపల ఉంచి, బయట తాళం వేసి పారిపోయాడు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వచ్చి ఆ భవనం మొత్తం చెక్ చేశారు. ఆ సందర్భంలో పోలీసులకు తాళం వేసి ఉన్న ఓ రూమ్ కనిపించింది. ఈ ఇంట్లో ఎవరు ఉంటారని పోలీసులు అడగ్గా, బాలిక అదృశ్యమైనప్పటి నుంచి ఆ యువకుడు కూడా కనిపించడం లేదని అక్కడ ఉండే వారు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు రూమ్ తాళం పగలగొట్టారు. అనంతరం లోపల దృశ్యాన్ని చూసి షాక్కు గురయ్యారు. బాధితురాలు అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. ఓ వైపు లైంగిక దాడి, మరోవైపు మధ్యాహ్నం నుంచి 8 గంటల పాటు ఆమెకు కనీసం తినడానికి తాగడానికి కూడా ఏమీ లేకపోవడంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.