రెండో కాన్పులో ఆడపిల్ల... గొంతులో వడ్లగింజ వేసిన తాత

ఈ నెల7న పాప చనిపోయిందని తల్లిదండ్రులు, తాత నాయనమ్మలు పాపను... గుట్టుచప్పుడు కాకుండా తమ వ్యవసాయ భూమిలోనే ఖననం చేశారు.

news18-telugu
Updated: September 10, 2019, 11:43 AM IST
రెండో కాన్పులో ఆడపిల్ల... గొంతులో వడ్లగింజ వేసిన తాత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అభివృద్ధిలో పరుగులు తీస్తున్న ఆడపిల్లపై సమాజంలో ఉన్న వివక్షత మాత్రం మారడం లేదు. ఇప్పటికే కడుపులో ఉన్న పిండం ఆడపిల్ల అని తేలితే... బయటకు రాకముందే చంపేస్తున్నారు. కొందరు దుర్మార్గులు పుట్టాక కూడా అంతమొందిస్తున్నారు. తాజాగా రెండోకాన్పులో కూడా ఆడపిల్ల పుట్టిందని ఓ తాతే స్వయంగా మనవరాలిని అంతమొందించాడు. పసిమొగ్గ అని చూడకుండా హత్య చేశాడు. ఈ దుర్ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.

రాయపర్తి మండలం కేశవపుర గ్రామ శివారుల్లో ఎర్రకుంటతండాకు చెందిన దంపతులకు గతేడాది ఏప్రెల్ 17న ఓ ఆడపిల్ల పుట్టింది. ఈనెల 4న అదే దంపతులకు వర్థన్న పేట ప్రభుత్వాసుపత్రిలో మరో పాప జన్మించింది. పాప పుట్టినప్పుడు 2.4 కిలోల బరువుతో ఎంతో ఆరోగ్యంగా ఉంది. ఈనెల 5న చిన్నారిని తల్లిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఈనెల7న పాప చనిపోయిందని తల్లిదండ్రులు, తాత నాయనమ్మలు పాపను... తమ వ్యవసాయ భూమిలోనే గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారు. అయితే చుట్టుపక్కల వాళ్లకు వీళ్ల తీరుపై అనుమానం కలిగింది. వెంటనే చైల్డ్ లైన్ అధికారులు సమాచారం అందించారు.

వెంటనే రంగంలోకి దిగిన అధికారులు... చిన్నారి ఇంటికి వచ్చి ఆరా తీశారు. పుట్టినప్పుడు పాప బలహీనంగా ఉందని... తీవ్ర జ్వరంతో చనిపోయిందని తెలిపారు. అయితే కుటుంబసభ్యుల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో... అధికారులు చిన్నారికి పోస్టు మార్టమ్ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. రెండో కాన్పులో కూడా ఆడపిల్ట పుట్టిందని పాపను చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. చిన్నారి గొంతులో వడ్లగింజ వేసి ఉంటారని భావిస్తున్నారు. పాప మృతికి కారణమైన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పోలీసుశ్ని ఆదేశించారు.

First published: September 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>