GRANDFATHER AND UNCLE RAPE ATTEMPT TO SIX YEARS GIRL AT MADHYA PRADESH VB
Attempt to rape: సమోసా కొనిస్తానని చెప్పి ఆరేళ్ల బాలికను రూం కి తీసుకెళ్లారు.. ఆ తర్వాత సొంత మామ, తాతయ్యలే దారుణంగా..
ప్రతీకాత్మక చిత్రం
Attempt to rape: నిర్భయలాంటి చట్టాలు ఎన్ని అమలు చేస్తున్నా.. బాలికలపై అత్యాచారాలు తగ్గడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా చిన్నారులపై ఆకృత్యాలు ఆగడం లేదు. ముఖ్యంగా బంధువులే అభం శుభం తెలియని బాలికలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారు. సమోసా కొనిస్తానని రూం కి తీసుకెళ్లి సొంత మామ, తాతయ్యలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
నిర్భయలాంటి చట్టాలు ఎన్ని అమలు చేస్తున్నా.. బాలికలపై అత్యాచారాలు తగ్గడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా చిన్నారులపై ఆకృత్యాలు ఆగడం లేదు. ముఖ్యంగా బంధువులే అభం శుభం తెలియని బాలికలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారు. సమోసా కొనిస్తానని రూం కి తీసుకెళ్లి సొంత మామ, తాతయ్యలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై సొంత మేనమామ, తాతయ్య సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికను గదిలో బంధించి అతి కిరాతకంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇక ఈ ఇదంతా బాధితురాలి సోదరుడి కళ్లేదుటే జరగడం మరింత కలిచి వేస్తోంది. బాలిక ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన తల్లి.. కూతురిని నిలదీయడంతో అసలు విషయం బయట పడింది. బాలిక తల్లి ఎప్పటిలాగే ఆఫీస్ నుంచి ఇంటికొచ్చింది. ఇంటి దగ్గర తన కూతురు కనిపించట్లేదని కంగారు పడింది. చుట్టు పక్కల వెతికిన తర్వాత బాలిక భయపడుతూ తన తల్లి వద్దకు వచ్చింది. ఏమైందని అడగడంతో భయపడుతూ సమాధానం చెప్పలేదు. తల్లి గట్టిగా మందలించడంతో తనకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలి తల్లి.. నిందితులపై ఫిర్యాదు చేసింది.
దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. బాలిక మామయ్య ఆమెకు సమోసాలు కొనిస్తానని చెప్పి బంధువుల ఇంటికి తీసుకువెళ్ళారని వెల్లడించారు. అక్కడ ఇద్దరూ బాలికను ఒక గదిలో బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయితే నిందితులు మైనర్ బాలికకు రూ.20 ఇచ్చి, ఈ సంఘటన ఎవరికీ చెప్పొద్దని కోరినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు 48 ఏళ్ల తాత అని, మరొకరు మామ వరుస అయ్యే దూరపు బంధువు(20) అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పోక్సో యాక్ట్ కింద అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
ఎన్ని కఠిన చట్టాలు చేసినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. దానికి తోడు స్మార్ట్ఫోన్లు.. పోర్న్ వీడియోల విషసంస్కృతి పెరిగిపోవడంతో సొంత వాళ్లే వాయు వరసలు లేకుండా కామంతో రగిలిపోతున్నారు. కామకోరికలు తీర్చుకునేందుకు దారుణాలకు తెగబడుతున్నారు. మహిళలపై దారుణమైన అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట మహిళలు, చిన్నారులు, యువతులపై బహిరంగంగానే లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. గుర్తుతెలియని వారితో జాగ్రత్తగా ఉండాలని చెప్పే కుటుంబసభ్యలే ఈ అఘాయిత్యానికి పాల్పడితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడుంటుంది. ఆరేళ్ల చిన్నారికి కుటుంబ సభ్యుల నుంచే ఆపదలు ఎదురవుతున్నాయి. దీంతో మనకు అండగా నిలుస్తారన్న వారే మన పాలిట రాక్షసులుగా మారుతుండటంతో ఇంట్లో కూడా రక్షణ కరువైంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.