పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి.. తాత మనవడి మృతి..

మోటారు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యలు వారికోసం వెతికారు. మానేరువాగులో శవమై కన్పించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

news18-telugu
Updated: July 3, 2020, 10:43 AM IST
పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి.. తాత మనవడి మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారిద్దరూ తాత మనవళ్లు. సరదాగా మాట్లాడుకుంటూ మనవడితో కలిసి నీరు పెట్టేందుకు తాత పొలం వద్దకు ఇంటిలో చెప్పి బయలుదేరాడు. కానీ మార్గమధ్యలోనే మానేరు వాగు వద్ద ప్రమాదవశాత్తు అందులో జారిపడి మరణించారు. ఈ విషాద ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన రైతు మల్లయ్య(55) ఇంటి దగ్గర ఆడుకుంటున్న మనవడు నందన్(9)ను వెంట తీసుకుని వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. అయితే మార్గమధ్యలో ఉన్న మానేరు వాగు వద్దకు చేరుకోగానే ప్రమాదవశాత్తు కాలుజారి తాతా మనమళ్లిద్దరూ వాగులో పడి పోయారు. నీటిలో మునిగి ఇద్దరూ చనిపోయారు. అయితే మోటారు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యలు వారికోసం వెతికారు.

మానేరువాగులో శవమై కన్పించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.
First published: July 3, 2020, 10:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading