Granddaughters Killed Grandmother : మానవసంబంధాలు మంటగలుస్తున్నాయి. కన్నవారు అన్న కనికరం కూడా లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఇద్దరు మహిళలను చేసిన పని అందరినీ షాక్ కు గురించేసింది. ఇలాంటి వాళ్లను ఏం చేసినా పాపం లేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంతకీ ఆ ఇద్దరు మహిళలు ఏం చేశారో ఇప్పుడు చూద్దాం.
తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లా పెట్టాయ్ కి చెందిన సుబ్బమ్మకి 90 ఏళ్లు. అయితే వయోభారంతో కొద్ది రోజులుగా ఆమె మంచానికే పరిమితమైంది. అయితే ఇలాంటి సమయంలో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మనవరాళ్లు..ఆమెను హత్య చేశారు. వృద్ధురాలి బాగోగులు చూసుకోవడం భారంగా మారిందని ఇద్దరు మనవరాళ్లు ఆమెను డంపింగ్ యార్డ్ దగ్గరకు తీసుకెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే డంపింగ్ యార్డ్ లో కాలిపోయి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అక్కడకు వెళ్లి శవాన్ని జిల్లా హాస్పిటల్ కి తరలించారు. పరీక్షించిన వైద్యులు అది ఓ వృద్ధురాలి మృతదేహం అని ఖరారు చేశారు.
ALSO READ Trains Cancelled : ప్రయాణికులకు బిగ్ అలర్ట్..రాబోయే 20 రోజుల పాటు 1100 ప్యాసింజర్ రైళ్లు రద్దు
దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆధాం నగర్ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు పరీశీలించారు. ఈ ఘటనతో సంబంధమున్న ఓ ఆటో డ్రైవర్ను ఫుటేజీలో గుర్తించారు. అతడిని స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మృతదేహం సుబ్బమ్మది అని, ఆమెను చూసుకునే మనవరాళ్లు మేరి, మరియమ్మే నిప్పంటించి హతమార్చినట్లు తెలిసింది. వృద్ధురాలి బాగోగులు చూసుకోవడం భారంగా మారిందనే ఇద్దరు మనవరాళ్లు ఆమెను చంపారని పోలీసులు వెల్లడించారు. ఆమెను ఆధాం నగర్ డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారని పేర్కొన్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచినట్లు చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలతో ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. సొంత మనవరాళ్లే తమ బామ్మను దారుణంగా చంపారని తెలిసి స్థానికులు షాకయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Tamilnadu