బాయ్ ఫ్రెండ్ తో కలిసి సొంత నాయినమ్మ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డ మనమరాలు...

డబ్బులు సరిపోకపోవడంతో ప్రియురాలి తో కలిసి వాళ్ళ నాయనమ్మ ఇంట్లోనే 18 తులాల బంగారం దొంగతనం చేసి చివరికి ఇద్దరు కటకటాల పాలయ్యారు.

news18-telugu
Updated: November 4, 2020, 11:46 PM IST
బాయ్ ఫ్రెండ్ తో కలిసి సొంత నాయినమ్మ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డ మనమరాలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో నివాసం ఉంటున్న అమిలియా అనే వృద్ధురాలి ఇంట్లో ఈ నెల 30వ తేదీన ఒక దొంగతనం జరిగినట్లు నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు అందింది.  ఫిర్యాదు అందుకున్న పోలీసులు జరిపిన విచారణలో ఫిర్యాదురాలి మనమరాలు పెట్రిసియా (21) యువతి ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితురాలు పెట్రిసియా కు నేరేడ్మెట్ కి చెందిన అజయ్ అనే యువకుడితో గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో పడింది. చెడు వ్యసనాలకు బానిసైన బాయ్ ఫ్రెండ్ అజయ్ డిజె గా పనిచేసేవాడు. అయితే లాక్ డౌన్ కారణంగా పనులు లేక డబ్బులకు ఇబ్బందులు ఎదురవ్వడంతో ప్రేమికురాలి చైన్ తీసుకుని అమ్మేశాడు.

అప్పటికి డబ్బులు సరిపోకపోవడంతో ప్రియురాలి తో కలిసి వాళ్ళ నాయనమ్మ ఇంట్లోనే 18 తులాల బంగారం దొంగతనం చేసి చివరికి ఇద్దరు కటకటాల పాలయ్యారు. పోలీసులు నిందితుని వద్ద నుండి బంగారం స్వాదీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
Published by: Krishna Adithya
First published: November 4, 2020, 11:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading