హైదరాబాద్‌లో దారుణం... 19ఏళ్ల యువతిపై తాత, మేనమామ అత్యాచారం

మేనమామ షేక్‌ సిద్దిఖ్‌ సైతం ఆరు నెలల క్రితం ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు.

news18-telugu
Updated: February 4, 2020, 9:36 AM IST
హైదరాబాద్‌లో దారుణం... 19ఏళ్ల యువతిపై తాత, మేనమామ అత్యాచారం
యువతిపై తాత, మేనమామ అత్యాచారం
  • Share this:
తెలంగాణలో సభ్య సమాజం తలదించుకున్నమరో దారుణ ఘటన చోటు చేసుకుంది. లాలనగా చూడాల్సి మనవారలిపై ఓ తాత తన పైశాచికత్వం చూపించాడు. అంతే కాదు.... బాధ్యతగా మేనకోడలిని రక్షించాల్సిన మేనమామ సైతం ఆమెపై తన క్రూరత్వం ప్రదర్శించాడు. ఫలితంగా తాను ఉంటున్న ఇంట్లోనే.. తన  అనుకున్నవారి చేతిలోనే... ఆ యువతికి తీరని అన్యాయం జరిగింది. తాత, మేనమామ కలిసి ఆమెపై గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో.. భరించలేని ఆ అభాగ్యురాలు చివరికి జరిగిన దారుణాన్ని తన తల్లికి తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసును ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బండ్లగూడ మహ్మద్‌ నగర్‌కు చెందిన షేక్‌ అఫ్సర్‌‌కు 70 ఏళ్లు. ఆయప మనుమరాలుకు 19 ఏళ్లు. చిన్నతనం నుంచే తాతగారి ఇంట్లోనే పెరిగింది. సదరు బాలికపై కన్నేసిన తాతయ్య షేక్‌ అఫ్సర్‌ రెండేళ్ల క్రితం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని కుమారుడు షేక్‌ సిద్దిఖ్‌ సైతం ఆరు నెలల క్రితం ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడంతో ఆమె ఈ నెల 1న చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు