ఆంధ్రప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్ ఎయిడెడ్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న గ్రామ వాలెంటీర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడుకు చెందిన వాలంటీర్..ఈ కిరతకానికి ఒడిగట్టాడు. స్కూల్ ప్రిన్సిపాల్‌కు, తల్లిదండ్రులకు చెప్పకుండా విద్యార్థునులను కొండవీడు కోటకు తీసుకెళ్లాడు వాలంటీర్. అక్కడ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ విధుల నుంచి వాలంటీర్‌ను తొలగించారు. గ్రామస్తుల సమాచారంతో ఎంపీడీవో వలంటీర్‌పై చర్యలు తీసుకున్నారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా స్కూలు యాజమాన్యం గోప్యంగా ఉంచింది. దీంతో కాస్త ఆలస్యంగా వాలంటీర్ కిరాతకం బటయకు వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.