హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime news : జల్సాల కోసం అప్పులు చేశాడు .. వాటిని తీర్చడం కోసమే ఆ విధంగా మారాడు

Crime news : జల్సాల కోసం అప్పులు చేశాడు .. వాటిని తీర్చడం కోసమే ఆ విధంగా మారాడు

ADILABAD THIEF

ADILABAD THIEF

Thief arrest: హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశాడు. కొంతకాలం హోటల్ బిజెనెస్ కూడా చేశాడు. అంతవరకు బాగానే ఉంది. నెమ్మదిగా జల్సాలకు అలవాటుపడ్డాడు. అప్పులు పెరిగిపోయాయి. ఇంకేముంది జల్సాల కోసం, అప్పు తీర్చడం కోసం దొంగతనాన్నిమార్గంగా ఎంచుకున్నాడు. పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Mancherial, India

  (K.Lenin,News18,Adilabad)

  హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు(Hotel Management Course)చేశాడు. కొంతకాలం హోటల్ బిజెనెస్ కూడా చేశాడు. అంతవరకు బాగానే ఉంది. నెమ్మదిగా జల్సాలకు అలవాటుపడ్డాడు. అప్పులు పెరిగిపోయాయి. ఇంకేముంది జల్సాల కోసం, అప్పు తీర్చడం కోసం దొంగతనాన్నిమార్గంగా ఎంచుకున్నాడు. పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసు(Police)లకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అయినా తీరు మార్చుకోలేదు. మళ్ళీ దొంగతనాలకు పాల్పడ్డాడు. మరోసారి పోలీసులకు దొరికిపోయాడు. ఇదేదో కథ కాదు. దొంగతనాలకు పాల్పడి మంచిర్యాల(Mancherial) పోలీసులకు చిక్కిన యువకుడు ఎందుకు దొంగగా మారాడో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు.

  Crime news: అందమే ఆమె పాలిట శాపమైంది .. భర్తను అనుమాన పిశాచిగా మార్చింది.. అసలేం జరిగిందంటే

  అప్పులు తీర్చడం కోసం..

  జయశంకర్ భూపాలపల్లిలోని కారల్ మార్క్స్ కాలనికి చెందిన దొరిశెట్టి స్వామి నిరంజన్ వరంగల్ లో హోటల్ మేనేజ్ మెంటి కోర్సు పూర్తి చేశాడు. అనంతరం పెళ్ళి చేసుకున్నాడు. కొంతకాలం హోటల్ వ్యాపారం కూడా చేశాడు. అది సరిగ్గా నడవకపోగా అప్పులపాలయ్యాడు. పెళ్ళి కూడా అయ్యింది. ఏ ఉద్యోగం లేక, కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. దీనికి తోడు జల్సాలకు అలవాటుపడ్డాడు. అందుకు డబ్బులు సరిపోకపోవడంతో అప్పులు చేశాడు. ఇలా అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చేందుకు దొంగతనాలకు పాల్పడటం మొదలు పెట్టాడు. భూపాలపల్లి పరిసర ప్రాంతాల్లో 2011, 2013, 2014 సంవత్సరరాలలో దొంగతనం చేసి భూపాలపల్లి పోలీసులకు దొరికి పరకాల జైలుకు వెళ్ళి  శిక్ష అనుభవించి వచ్చాడు.

  చోరవృత్తిని ఎంచుకున్న గ్రాడ్యుయేట్..

  జైలుశిక్ష అనుభవించి విడుదలైన తర్వాత బుద్ధి మారలేదు. అయితే దొంగతనాలు చేసుకునేందుకు మకాం మార్చాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏరియాలో దొంగతనం చేసిన కేసులలో కరీంనగర్ జైల్ కు వెళ్ళి వచ్చాడు. ఖమ్మం జైలుకు వెళ్ళి తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జైలు నుండి విడుదలయ్యాడు. పలుమార్లు జైలుకు వెళ్లి రావడంతో పని చేయడం అలవాటు లేక మళ్లీ దొంగతనాలనే వృత్తిగా మార్చుకున్నాడు. ఈసారి మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన తన మిత్రుడు అవునూరి రాహుల్ తో కలిసి మంచిర్యాల, నస్పూర్ ప్రాంతాల్లో మళ్ళి దొంగతనాలకు పాల్పడ్డాడు.

  Snake: జీవితాలను చిదిమేసిన సర్పం.. ఆ గిరిజన కుటుంబానికే ఎందుకు అలా జరిగింది?

  జైలుకెళ్లినా మారని దొంగ బుద్ధి..

  దొంగతనం చేసిన బంగారు, వెండి అభరణాలను మంచిర్యాల టౌన్‌లో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు దొరిశెట్టి స్వామి నిరంజన్ విచారించడంతో అసలు విషయం బయటపడింది. మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టి వాడలోని ఇంట్లో తానే దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని 20 తులాల బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయల నగదు, ఒక మోటర్ బైక్, ఒక ఫోన్, కత్తి, ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రాహుల్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Mancherial, Telangana crime news

  ఉత్తమ కథలు