Pulwama Attack Terrorist : 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. సీఆర్పీఎఫ్ సిబ్బంది వెళ్తున్న బస్సును ఉగ్రవాదులు పేల్చివేశారు. ఆ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత సైనికులు పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి కూడా జరిపారు. అయితే పుల్వామా ఉగ్రదాడి జరిగిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో నిందితుడు, పాకిస్థాన్ జాతీయుడు మొహియుద్దీన్ ఆలంగీర్ ను సోమవారం కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ తరఫున దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడని కేంద్ర హోంశాఖ తెలిపింది.
ఆలంగీర్(39)..పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని బహవల్ పూర్ లో జనవరి 1,1983న జన్మించాడు. జేఈఎమ్ సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. అతడికి మఖ్తాబ్ అమీర్, ముజాహిద్ భాయ్, మహమ్మద్ భాయ్ అనే మూడు పేర్లు ఉన్నాయి. ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ తరఫున మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడని, పుల్వామా దాడిలో ఆలంగీర్ ప్రమేయం ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది. ప్రభుత్వం టెర్రరిస్టుగా ప్రకటించిన 33వ వ్యక్తి ఆలంగీర్.
ALSO READ Viral Video : ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
మరోవైపు,ముంబై మారణకాండ సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్(46) కూడా ఉగ్రవాదే అని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్ లో ఉగ్రవాదుల నియామకం, నిధుల సేకరణ, ఉగ్ర దాడుల అమ ల్లో తల్హా చురుగ్గా పాల్గొన్నాడని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అతడు పాకిస్థాన్‌లో లష్కరే తాయిబా ఉగ్ర సంస్థలను సందర్శిస్తున్నాడని, భారత్, ఇజ్రాయెల్, అమెరికా తదితర పాశ్చాత్యా దేశాలపై యుద్ధం చేయాలని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడని వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pulwama Terror Attack, Terrorists, Union Home Ministry