రూ.5 లక్షలిస్తా... ప్రమోషన్ కోసం లంచం ఆఫర్... సస్పెండ్ అయిన ఉద్యోగి

ఎక్కడైనా లంచం అడిగితే ఇవ్వడానికి ఇబ్బంది పడే సందర్భాలుంటాయి. ఇది రివర్స్ కేసు. ప్రమోషన్ కోసం లంచం ఆఫర్ చేశాడు. చివరకు తిక్క కుదిరింది.

Krishna Kumar N | news18-telugu
Updated: February 20, 2019, 10:52 AM IST
రూ.5 లక్షలిస్తా... ప్రమోషన్ కోసం లంచం ఆఫర్... సస్పెండ్ అయిన ఉద్యోగి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వరంగల్ అర్బన్ జిల్లా... కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మాసిస్టు గ్రేడ్- 2గా పనిచేస్తున్నాడు బత్తిని సత్యనారాయణగౌడ్. ఇద్దరు ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చేలా చేస్తే రూ.5 లక్షలు లంచంగా ఇస్తానని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావుకు మొబైల్‌లో మెసేజ్ పంపాడు. జనరల్‌గా ఇలాంటి ఆఫర్లు చేసేవారు ఆధారాలు లేకుండా నోటి మాటగా ఆఫర్లు ఇస్తారు. ఎందుకంటే అవతలి వాళ్లు రివర్స్ అయితే... తాము అలా అనలేదని తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ వ్యవహారంలో సత్యనారాయణ మొబైల్ మెసేజ్ పంపడం వల్ల అది పక్కా ఆధారంగా నిలించింది. డీ హెచ్ క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. సత్యనారాయణను సస్పెండ్ చేశారు.

సర్ మీకో రిక్వెస్ట్. మెడికల్ సోషల్ వర్కర్ పదోన్నతుల్లో ఎవరికైతే అన్యాయం జరిగిందో, వారికి మీరు చొరవ తీసుకొని ప్రమోషన్ ఇస్తే రూ.5 లక్షలు మీకు ఏర్పాటుచేస్తాను సర్. ఎవరినీ నమ్మలేక, తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని నేరుగా అడుగుతున్నాను. అన్యధా భావించవద్దు. ఎన్నికల నియమావళి అమల్లోకి రానుందని, తర్వాత ఎవరైనా సీనియర్లు వస్తే... పదోన్నతి తమ దాకా రాదని భయపడుతున్నారు
సత్యనారాయణ పంపిన మొబైల్ మెసేజ్ సారాంశం.


ఈ విషయం ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి దృష్టికి వెళ్లింది. తీవ్ర కలకలం రేపింది. దీనిపై నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుకోకముందే చెక్ పెట్టాలనుకున్న ఆమె... క్రమశిక్షణ చర్యలు చేపట్టి సత్యనారాయణగౌడ్‌ను సస్పెండ్ చేశారు.

 


ఇవి కూడా చదవండి :


ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...


పడక సుఖానికి దివ్య ఔషధం యాలకులు... ఎలా వాడాలంటే...

పండ్లపై ఉప్పు చల్లుకొని తింటున్నారా... ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే

First published: February 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు