ఎంత దారుణం.. భర్తను చంపితే అలా కలిసొస్తుందని..

టీవల ఓరోజు స్కూల్ నుంచి తిరిగొచ్చాక భార్య మేమావతితో వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన మేమావతి పదునైన ఆయుధంతో భర్తపై దాడి చేసి హతమార్చింది.

news18-telugu
Updated: September 19, 2019, 8:08 AM IST
ఎంత దారుణం.. భర్తను చంపితే అలా కలిసొస్తుందని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే ఓ భార్య కిరాతకంగా హతమార్చింది.భర్తను చంపితే తనకు ఫించన్, అతని ఉద్యోగం కుమారుడికి వస్తుందన్న దుర్బుద్దితో హత్యకు పాల్పడింది. హత్యానంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. తల్లీకొడుకులు కలిసి సమీపంలోని అడవిలో పారేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. బులంద్‌షహర్‌లోని ప్రభుత్వ స్కూల్లో తేజ్‌రామ్ ప్రజాపతి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు.ఇతనికి భార్య మేమావతి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే గత 20 ఏళ్లుగా తేజ్‌రామ్‌కి,అతని భార్యకు మధ్య తరుచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.తేజ్‌రామ్ ప్రజాపతి తన ఫించన్ పత్రాల్లో భార్య పేరు కూడా రాయించలేదు. ఆ విషయంపై కూడా ఇటీవల గొడవైంది. ఇటీవల ఓరోజు స్కూల్ నుంచి తిరిగొచ్చాక భార్య మేమావతితో వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన మేమావతి పదునైన ఆయుధంతో భర్తపై దాడి చేసి హతమార్చింది. ఆ తర్వాత తన చిన్న కొడుకుతో కలిసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి సమీపంలోని ఓ అడవిలో పారేసింది.స్థానిక వ్యక్తి ఒకరు అడవిలో మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగుచూసింది. దీనిపై మేమావతి కుటుంబ సభ్యులను విచారించగా అసలు విషయం బయటపడింది. భర్తను చంపితే తనకు ఫించన్,కుమారుడికి ఉద్యోగం వస్తుందన్న ఉద్దేశంతోనే హత్య చేసినట్టు తెలిపింది.

First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading