హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరి అరెస్ట్..ఉదయం బుచ్చిబాబు..ఇప్పుడు ఎవరంటే?

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరి అరెస్ట్..ఉదయం బుచ్చిబాబు..ఇప్పుడు ఎవరంటే?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరి అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరి అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో  అటు సీబీఐ (Central Burew Of Investigation), ఇటు ఈడీ (Enforcement Directorate) దూకుడు పెంచింది. ఈరోజు ఉదయం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మాజీ సీఏ బుచ్చిబాబును అరెస్ట్ చేయగా తాజాగా ఈ కేసులో మరొకరిని ఈడీ  (Enforcement Directorate) అరెస్ట్ చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో  అటు సీబీఐ (Central Burew Of Investigation), ఇటు ఈడీ (Enforcement Directorate) దూకుడు పెంచింది. ఈరోజు ఉదయం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మాజీ సీఏ బుచ్చిబాబును అరెస్ట్ చేయగా తాజాగా ఈ కేసులో మరొకరిని ఈడీ  (Enforcement Directorate) అరెస్ట్ చేసింది. ఈ కేసులో గౌతమ్ మల్హోత్రా (Goutham Malhothra)ను ఈడీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఒయాసిస్ గ్రూప్ తో మల్హోత్రాకు సంబంధాలున్నాయని అనుమానాలు, ఆరోపణల నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మనీలాండరింగ్ అభియోగంపై అతడిని ఈడీ  (Enforcement Directorate) అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Telangana: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో స్పీడు పెంచిన సీబీఐ .. ఎమ్మెల్సీ కల్పకుంట్ల కవిత మాజీ సీఏ అరెస్ట్

వరుస అరెస్టులు..

ఇక ఈ కేసులో వరుస అరెస్టులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈరోజు ఉదయం సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఇంతలో మరొకరిని ఈ కేసులో అరెస్ట్ చేయడం గమనార్హం. చాలా రోజుల తరువాత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇద్దరినీ అరెస్ట్ చేయడంతో కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అటు బుచ్చిబాబు, ఇటు గౌతమ్ మల్హోత్రాను అధికారులు విచారించే అవకాశం ఉంది. దీనితో ఆయా వర్గాల్లో టెన్షన్ నెలకొంది.

Inspiring Story: 60ఏళ్ల వృద్దుడికి వచ్చిన అద్భుతమైన ఐడియా .. ఓల్డ్‌ మెన్‌ కాదు వెరీ స్ట్రాంగ్ మెన్

ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఇటీవల మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో కీలక వ్యక్తుల పేర్లు పేర్కొంది. ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Delhi cm Kejriwal), వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. అలాగే అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన డబ్బును ఆప్ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడారని ఈడీ పేర్కొంది. ఇక సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేరులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అలాగే విచారించిన జాబితాలో కవిత పేరును ఈడీ పేర్కొంది. ఇక ఈడీ (Enforcement Directorate) ఛార్జ్ షీట్ లో తన పేరును ప్రస్తావించడంపై కేజ్రీవాల్ (Delhi cm Kejriwal) సెటైర్లు వేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పని చేయడం లేదు. ప్రభుత్వాలను కూల్చడానికి ఈడీ  (Enforcement Directorate) పని చేస్తుంది. ఈ ఛార్జ్ షీట్ మొత్తం ఒక కల్పితమని ఢిల్లీ సీఎం కొట్టిపడేశారు. ఇక తాజా అరెస్టులతో కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

First published:

Tags: Arrested, Crime, Delhi liquor Scam, Enforcement Directorate

ఉత్తమ కథలు