హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఇంతకన్నా ఘోరం ఉండదు.. కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చిన అత్యాచార బాధితురాలపై.. మళ్లీ గ్యాంగ్ రేప్

ఇంతకన్నా ఘోరం ఉండదు.. కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చిన అత్యాచార బాధితురాలపై.. మళ్లీ గ్యాంగ్ రేప్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

స్పహ వచ్చిన తర్వాత.. తన బట్టలు చెల్లా చెదురుగా ఉన్నాయని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. ఇదేంటని అడిగిత వారిద్దరు బెదిరించారని చెప్పింది. అత్యాచార ఘటనను వీడియో కూడా తీశారని.. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది.

ఇంకా చదవండి ...

ఆమె అత్యాచార బాధితురాలు. కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లింది. తీసుకొచ్చింది ఎవరో కాదు నిందితుడు సోదరుడే. తాను చెప్పినట్లుగా కోర్టులో వాంగ్మూలం ఇస్తే... అతడితో పెళ్లి చేస్తానని నమ్మించాడు. ఆ మాటలు విని కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఆమె సిద్ధపడింది. నమ్మి అతడి వెంట వెళ్లిపోయింది. అంతే.. ఆ తర్వాత మరో ఘోరం జరిగింది. మళ్లీ మోసపోయింది. హోటల్ ఉన్న ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.

బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. 2021లో ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ ఘటనకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. నేరం రుజువైతే నిందితుడికి కఠిన శిక్ష పడుతుంది. ఈ విషయం తెలిసి నిందితుల బంధువులు ఆ బాలికతో రాజీకి వచ్చారు. కోర్టులో తాము చెప్పినట్లు సాక్షం చెబితే అతడితో వివాహం జరిపిస్తానని బ్రిజేష్ అనే వ్యక్తి బాధితురాలు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం బాలికను తీసుకొని అలహాబాద్‌కు వెళ్లారు. అలహాబాద్‌లోని సివిల్ లైన్స్‌లో ఓ హోటల్లో ఆ బాలికతో పాటు బ్రిజేష్, మరో వ్యక్తి బస చేశారు. మరసటి రోజు అలహాబాద్ హైకోర్టులో వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. ఆ రోజు రాత్రి ముగ్గురూ భోజనం చేశారు. ఐతే ఆహారంలో నిద్రమాత్రలు కలపడంతో ఆమె నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో బ్రిజేష్‌తో పాటు అతడి వెంట వచ్చిన మరో వ్యక్తి కలిసి బాలికను రేప్ చేశారు.

Siddipet:ఇంటి నుంచి వెళ్లిన ప్రేమజంట..చెట్టుకు వేలాడుతూ కనిపించారు.. మధ్యలో ఏం జరి

స్పహ వచ్చిన తర్వాత.. తన బట్టలు చెల్లా చెదురుగా ఉన్నాయని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. ఇదేంటని అడిగిత వారిద్దరు బెదిరించారని చెప్పింది. అత్యాచార ఘటనను వీడియో కూడా తీశారని.. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. తాను భయపడిపోయి.. కోర్టులో వారికి అనుకూలంగా వాంగూల్మం ఇచ్చింది బాధితురాలు. కోర్టు కేసు తర్వాత వారు సొంతూరికి వెళ్లిపోయారు. అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మార్చి 30న సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Shocking: సిక్కిం పారాగ్లైడింగ్​లో పెను విషాదం.. నదిలో పడి తెలంగాణ యువతి మృతి..

బాలిక ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని సివిల్ లైన్స్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పేర్కొన్నారు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. వారు బస చేసిన హోటల్‌కు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Crime, Crime news, Up news, Uttar pradesh

ఉత్తమ కథలు