GOPALGANJ YOUNG MAN TELLS PARENTS THAT HE IS GOING TO BENGALURU AFTER SOME HOUR PARENTS RECIVED SON DEATH NEWS PVN
Very Sad : బెంగళూరు వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయల్దేరాడు..కొద్దిసేపటికే శవంగా ఇంటికి
యువకుడి కుటంబసభ్యులు
Young man died : బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఘోరం జరిగింది. బెంగళూరు వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వచ్చిన యువకుడు..కొద్దిసేపటికే జాతీయ రహదారి పక్కన శవమై పడి ఉన్నాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని సదర్ ఆసుపత్రికి తరలించారు.
Gopalganj young man died : బీహార్(Bihar)లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఘోరం జరిగింది. బెంగళూరు(Benagaluru) వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వచ్చిన యువకుడు..కొద్దిసేపటికే జాతీయ రహదారి పక్కన శవమై పడి ఉన్నాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని(Dead body) స్వాధీనం చేసుకుని సదర్ ఆసుపత్రికి తరలించారు. యువకుడు చనిపోయినట్లు డాక్టర్లు అధికారికంగా దృవీకరించిన తర్వాత.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారుడు మరణవార్త విన్న తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. కన్నబిడ్డను కోల్పోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. యువకుడి కుటంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...గోపాల్‌గంజ్ లో సూరజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురాణి చౌక్ మొహల్లాలో నివాసముంటున్న లక్ష్మణ్, రామ్ కుమారుడు సూరజ్ అలియాస్ రాజా అనే యువకుడు ఆదివారం బెంగళూరు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాజేంద్ర బస్టాండ్‌కు వెళ్లేందుకు ఆదివారం బస్సు ఎక్కాడు. ఇంటి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కహాన్ వంతెన సమీపంలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా యువకుడి మృతదేహం రోడ్డు పక్కన పడి ఉంది. ఆ సమయంలో సూరజ్ శరీరం నుంచి రక్తం కారుతోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత, పోలీసులు దానిని పోస్ట్‌మార్టం కోసం సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు ఎలా మరణించాడనేది నిర్థారణ కానప్పటికీ బస్సు నుంచి పడి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. కొడుకు సంపాదనకు వెళ్లాడని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేసినా.. కొన్ని గంటలకే వారి ఆనందం శోకసంద్రంగా మారింది.
మరోవైపు,అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. రైలు పక్కన ఒక ట్రక్ ను స్థానికులు గమనించి అక్కడికి వెళ్లి చూశారు. అందులో కుప్పలుగా శవాలు పడి ఉన్న శవాలను చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మెక్సికన్ నుంచి 160 మైళ్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ట్రక్ అక్కిడికి ఎలా వచ్చిందో విచారణ చేపట్టారు. అంత మంది విగత జీవులుగా మారడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ప్రజలు అక్కడ గన్ కల్చర్ లో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ప్రతిరోజు కాల్పుల ఘటనలు వెలుగులోనికి వస్తున్నాయి. దుండగులు పాఠశాలలు, సూపర్ మార్కెట్ లు, బహింరంగ ప్రదేశాల్లో కాల్పులకు తెగబడుతున్నారు. కొన్ని చోట్ల ప్రవాస భారతీయులనే టార్గెట్ గా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈ దారుణమైన ఘటన కలకలం రేపుతోంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.