హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: వైసీపీ నేతపై హత్యాయత్నం..! అసలు కారణం అదేనా..?

Andhra Pradesh: వైసీపీ నేతపై హత్యాయత్నం..! అసలు కారణం అదేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ కక్షలు భగ్గుమంటున్నాయి. నిత్యం ఏదో చోట పార్టీల కార్యకర్తలు, నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్షలు భగ్గుమంటున్నాయి. నిత్యం ఏదో చోట పార్టీల కార్యకర్తలు, నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో అధికార వైసీపీకి చెందిన ఓ నేతపై ప్రత్యర్థులు దాడికి యత్నించారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా గురజాల పట్టణానికి చెందిన వైసీపీ నేత దేవుళ్ల కొండలుపై దుండగులు దాడికి యత్నించారు. ఏ పనిమీద దాచేపల్లి ఎస్సైని కలిసేందుకు వెళ్లిన కొండలు.. తిరిగి ఇంటికి వెళ్తుండగా.., దుండగులు అడ్డుకున్నారు. తొలుత బండరాయితో మోదేందుకు యత్నించారు. వెంటనే తేరుకున్న  కొండలు  వారి నుంచి  తప్పించుకున్నాడు. ఆ తర్వాత కత్తులతో నరికేందుకు వెంబడించారు. పత్తిచేలల్లో పరుగులు పెట్టినా విడిచిపెట్టకపోవడంతో పోలీసులు, బంధువులు, పోలీసులకు ఫోన్ చేసి చిన్నగాయాలతో బయటపడ్డాడు. కొండలు ఫోన్ తో పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సరికి దుండగులు పారిపోయారు.

గాయలతో బయటపడ్డ కొండలును దాచేపల్లి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. రాజకీయ కక్షలతోనే ఈ దాడి జరిగినట్లు కొండలు ఆరోపించాడు. ప్రస్తుతం కొండలు వైసీపీ సోషల్ మీడియా విభాగంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొండలు పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యాయత్నాకి పాల్పడిన దుండగుల కోసం గాలిస్తున్నారు.

ఐతే దాడి వెనుక మరో కారణమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజకీయ కక్షతో పాటు మరేదైనా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. కొండలుపై దాడి జరిగిన ప్రాంతంలోని సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేయడంతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. అలాగే దుండగులు రెక్కీ నిర్వహించి దాడి చేయడంతో వారం రోజుల నుంచి కొండలను ఫాలో అయిన వ్యక్తులు, అతడు వెళ్లి చోట అనుమానాస్పద కదలికలపై కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Crime, Guntur, Murder attempt

ఉత్తమ కథలు