Google Serch: ఆరేళ్ల కిందట యువతి అదృశ్యం.. క్షేమంగా ఇంటికి చేర్చిన గూగుల్

ఆరేళ్ల కిందట తప్పి పోయిన యువతిని గూగుల్ తమ తల్లి దండ్రులను చేరేలా చేయడంలో సహాయపడింది..? అది కూడా అడ్రస్ పూర్తిగా తెలియకపోయినా సాయం చేసింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? కానీ గుగూల్ చేసిన సాయం ఆ తల్లి దండ్రులకు అమిత ఆనందాన్ని ఇచ్చింది.

 • Share this:
  P. Bhanu Prasad, Correspondent, Visakhapatnam, news18                              గూగుల్ ఉపయోగాలు ఎన్నో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తాజాగా ఓ యువతిని క్షేమంగా తన ఇంటికి చేర్చింది. గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే అందర్నీ క్షేమంగానే చేరుస్తుంది కదా ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.. అయితే అసలు అడ్రస్ ఏంటో తెలియని యువతిని.. అదీ ఆరేళ్ల తరువాత తన ఇంటికి చేరేలా చేసింది. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. కానీ ఇది నిజం.. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఆరు సంవత్సరాల క్రితం కనిపించకుండాపోయిన యువతి ఆచూకీ ఎట్టకేలకూ లభ్యమైంది. అది కూడా గూగుల్ సాయంతో.. కురుపాం గ్రామానికి చెందిన ఓ సెల్ పాయింట్ యజమాని అయిన ఓ యువకుడి సహకారంతో పువ్వల జయసుధ అనే యువతి ఆచూకీ లభ్యం అయింది. ఆ యువతిని పోలీసులు ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నారు. ఈ సందర్భంగా యువతి తల్లిదండ్రులు ఆ సెల్ పాయింట్ యజమాని కి. గూగుల్ కు ధన్యవాదాలు చెబుతున్నారు..

  ఏపీలోని విజయనగరం జిల్లాలో ఆరు సంవత్సరాల కిందట 2016 నుండి.. విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి గ్రామానికీ చెందిన పువ్వల జయసుధ అనే యువతి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు జిల్లా పోలీసులకు 2016లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. అలా రెండు మూడేళ్లు వెతికినా దొరకకపోవడంతో మిస్సింగ్ మిస్టరీగానే మిగిలింది.,.

  అలా తప్పి పోయిన యువతి ప్రస్తుతం పాండిచ్చేరిలోని సహోదరి-స్వధార్ గృహం ఆశ్రమంలో ఆశ్రయం పొందుతోంది. అయితే ఆమె మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో సరైన అడ్రస్ చెప్పలేకపోయేది. ఎన్నిసార్లు అడిగినా ఎదో ఒక ఊరి పేరు సగం సగం చెప్పేది. అయితే ఇటీవల ఆమెకు కాస్త నయం అవ్వడంతో.. ఆమెను తనకు తెలిసిన గ్రామాల పేర్లు చెప్పమని ప్రశ్నించారు. దీంతో పువ్వల జయసుధ కురపాం.. గుమ్మ లక్ష్మి పురం అంటూ కొన్ని పేర్లు చెప్పే ప్రయత్నం చేసింది. ఆ యువతి ఇచ్చిన సమాచారంతో ఆశ్రమ నిర్వాహకులు గూగుల్ మ్యాప్ ద్వారా కురుపాంలో ఏదైనా ఫోన్ నెంబర్ దొరుకుతుందా అని గూగుల్ లో సెర్చ్ చేశారు. ఆ సమయంలో కురపాంలో ఉన్న ఓ సెల్ పాయింట్ యజమానిని ఫోన్ నెంబర్ లభించడంతో ఆయన్ను సంప్రదించారు. ఆమె తమ వద్దే ఉందని సమాచారం ఇచ్చారు. దీంతో ఆ సెల్ పాయింట్ యజమాని.. ఆ యువతితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  ఆ వెంటనే ఎల్విన్ పేట పోలీసులను సంప్రదించగా 2016లో ఒక మిస్సింగ్ కేసు నమోదు అయిందని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసుల సహకారంతో.. జయసుధ కుటుంబ సభ్యులకు ఆ సెల్ పాయింట్ యజమాని సమాచారం అందించారు. తరువాత ఉదయం వీడియో కాల్ లో ఆ యువతితో కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. దీంతో ఇన్నాళ్లకు తమ బిడ్డ ఆచూకీ దొరికనందుకు ఆనందంలో మునిగి తేలుతున్నారు పువ్వల జయసుధ కుటుంబ సభ్యులు. తమ బిడ్డ ఆచూకీ తెలిపినందుకు ఆ సెల్ పాయింట్ యజమానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా..పువ్వల జయసుధను పోలీసుల త్వరలో స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎప్పుడో తప్పిపోయిన తమ కుమార్తెను సెల్ పాయింట్ యజమాని పృథ్వీ సహకారంతో ఆచూకీ లభించడంపై న్న యువతి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ కూతుర్ని అప్పగించడంలో సహాయ పడ్డ గూగుల్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

  ఇక సెల్ పాయింట్ యజమాని పృథ్వీ మాట్లాడుతూ... ఆశ్రమ నిర్వాహకులు మొదట గూగుల్ మ్యాప్ లో తన సెల్ పాయింట్ ను, సెల్ పాయింట్ అడ్రస్ లో ఇచ్చిన తన నెంబర్ కు ఫోన్ చేశారని తెలిపాడు. వారు మొదట తమిళంలో మాట్లాడటంతో తనకు అర్థం కాలేదని.. ఏదో ఫేక్ కాల్ అయి ఉంటుందని భావించానని తెలిపాడు. తర్వాత యువతి ఊరి పేరును, తల్లిదండ్రుల పేరును ఇంగ్లీష్ లో చెప్ఫడంతో కొంత అర్ధం చేసుకున్నానని పృథ్వీ తెలిపాడు. తమిళంలో అయితే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్న ఉద్దేశంతో.. యానాంలో ఉన్న తమిళ భాష తెలిసిన తన స్నేహితుడి ద్వారా ఆశ్రమ నిర్వాహకులను మరలా సంప్రదించి పూర్తి వివరాలు తీసుకున్నామన్నారు. దీంతో అమ్మాయితో మాట్లాడితే అసలు విషయాలు తమకు చెప్పిందని, 2016 లో నుంచి బయటకు వచ్చినట్టు చెప్పిందని తెలిపిందన్నాడు. దీంతో వెంటనే ఎల్విన్ పేట పోలీసులను, పోలీసుల ద్వారా యువతి తల్లిదండ్రులను సంప్రదించామన్నాడు. ఆ యువతి తో ఆశ్రమ నిర్వాహకుల ఫోన్ తో వీడియో కాల్ లో మాట్లాడించామని తెలిపాడు. మొత్తానికి ఆరేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఆ యువతిని తల్లిదండ్రుల వద్దకు తిరిగి చేరుకుంటోంది.
  First published: