• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • GOOGLE SEARCH FRAUD HYDERABAD WOMAN LOSES RS 3 LAKHS TO FAKE CUSTOMER CARE PHONE NUMBER SU

Google Search Fraud: కొంప ముంచిన గూగుల్ సెర్చ్.. రూ. 3లక్షలు పొగొట్టుకున్న మహిళ.. ఆ సమాచారం కోసం గూగుల్‌లో వెతక్కపోవడమే బెటర్

Google Search Fraud: కొంప ముంచిన గూగుల్ సెర్చ్.. రూ. 3లక్షలు పొగొట్టుకున్న మహిళ.. ఆ సమాచారం కోసం గూగుల్‌లో వెతక్కపోవడమే బెటర్

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad - Cyber Crime: ప్రస్తుత కాలంలో దేని గురించి తెలుసుకోవాలన్న గూగుల్‌ను ఆశ్రయించడం చాలా మందికి అలవాటుగా మారింది. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునేవరకు ఎన్నో విషయాల కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు.

  • Share this:
    ప్రస్తుత కాలంలో దేని గురించి తెలుసుకోవాలన్న గూగుల్‌ను ఆశ్రయించడం చాలా మందికి అలవాటుగా మారింది. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునేవరకు ఎన్నో విషయాల కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. అయితే గూగుల్‌లో సెర్చ్ చేసిన తర్వాత అక్కడ దొరికే సమాచారం అంతా నిజమని భావిస్తే మనం అడ్డంగా బుక్కైపోతాం. ముఖ్యంగా క్రెడిట్ కార్డు, బ్యాంక్‌లు, మార్కెటింగ్ సంస్థల కస్టమర్ కేర్ నెంబర్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సైబర్ నేరగాళ్లు చాలా తేలివిగా గూగుల్‌ సెర్చ్‌లో తమ నెంబర్లు కనిపించేలా టెక్నాలజీతో మాయ చేస్తున్నారు. ఈ విషయం తెలియక పలువురు గూగుల్ సెర్చ్‌ను గుడ్డిగా నమ్మి డబ్బులు, ఇతర కీలక సమాచారం లాస్ అవుతున్నారు. తాజాగా ఓ మహిళ గూగుల్ సెర్చ్‌లో కనిపించిన నెంబర్‌కు ఫోన్ చేసి ఏకంగా 3.15 లక్షల రూపాలయను పొగొట్టుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

    వివరాలు.. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ మహిళ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో ఓ వస్తువు కోసం ఆర్డర్ చేసింది. అయితే ఆర్డర్ డెలివరీ లేట్ కావడంతో.. దాని స్టేటస్ తెలుసుకోవడానికి కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతకడం ప్రారంభించింది. అక్కడ కనిపించిన ఓ నెంబర్‌ను గుర్తించి.. వెంటనే కాల్ చేసింది. తన ఆర్డర్ వివరాలను అవతలి వ్యక్తికి తెలియజేసింది. దీంతో అతడు కొద్దిసేపటి తర్వాత మహిళకు తిరిగి ఫోన్ చేసి.. అమెజాన్ ప్రతినిధినంటూ మాట్లాడాడు. ఆమె ఆర్డర్ చేసిన వస్తువు స్టాక్ లేకపోవడంతో లేట్ అయిందని చెప్పాడు.

    స్టాక్ లేకపోవడం వల్ల ఆమె డబ్బును తిరిగి చెల్లిస్తామని నమ్మబలికాడు. అయితే అది నకిలీ నెంబర్ అని తెలియక.. సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుంది. ఆమె ఫోన్‌కు ఓ క్యూఆర్ కోడ్ పంపించి దానిని క్లిక్ చేయాలని సూచించాడు. అలా చేస్తే మీ ఖాతాలోకి డబ్బులు క్రెడిట్ అవుతాయని చెప్పాడు. అది నిజమేనని నమ్మిన ఆ మహిళ.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసింది. దీంతో క్షణాల్లో ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 3.15 లక్షలు కట్ అయ్యాడు. ఇక, తన పూర్తి కావడంతో అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ చేసేశాడు.

    తిరిగి అదే నెంబర్‌కు ఫోన్ చేసిన మహిళ.. తాను మోసపోయానని గ్రహించింది. ఈ ఘటనకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, బ్యాంక్, క్రెడిట్ కార్డు, ఇతర ముఖ్యమైన సంస్థల కస్టమర్ కేర్‌ నెంబర్ల‌ను అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే పొందాలని నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: