22 ఏళ్లుగా మిస్సింగ్ మిస్టరీ... శవాన్ని కనిపెట్టిన గూగుల్ ఎర్త్

Google Earth : ఇదెలా సాధ్యం... గూగుల్ ఎర్త్ ద్వారా... శవం ఎలా బయటపడుతుంది? పోలీసులు కనిపెట్టలేనిది గూగుల్ ఎర్త్ ఎలా కనిపెడుతుంది అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 14, 2019, 9:08 AM IST
22 ఏళ్లుగా మిస్సింగ్ మిస్టరీ... శవాన్ని కనిపెట్టిన గూగుల్ ఎర్త్
గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజ్‌లో కనిపిస్తున్నకారు (Source - Google Earth)
  • Share this:
విలియం మోల్ట్ 1997 నవంబర్‌లో మిస్సింగ్ అయ్యాడు. 40 ఏళ్ల మోల్ట్... ఫ్లోరిడా... వెల్లింగ్టన్‌లోని నైట్ క్లబ్ నుంచీ బయలుదేరాక కనిపించకుండాపోయాడు. ఆ సమయంలో... అతని ఇంటిపక్కన నివసించే ఓ పెద్దాయన... ఇప్పుడు అక్కడ లేకపోయినా... గూగుల్ ఎర్త్ ద్వారా... అప్పుడు తాను నివసించిన ఇంటిని జూమ్ చేసి చూశాడు. ఇంటి పక్కనే ఓ సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో ఏదో ఉన్నట్లు ఆయనకు అనిపించింది. అదేంటా అని మరింతగా జూమ్ చేసి చూశాడు. అది ఓ కారులాగా అతనికి అనిపించింది. ఆశ్చర్యపోయాడు. ఎప్పుడో 22 ఏళ్ల కిందట మిస్సైన విలియం మోల్ట్ కారులా ఉంది అది. వెంటనే పోలీసులకు కాల్ చేశాడు. విషయం చెప్పాడు. వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. పావుగంటలో ఆ ముసలాయన్ని కలిశారు. ఆయన ద్వారా మరోసారి గూగుల్ ఎర్త్‌లో వాళ్లు కూడా చూశారు. షాక్ అయ్యారు. వెంటనే అక్కడకు వెళ్లారు. సరస్సులో తుప్పపట్టి ఉన్న వైట్ సెడాన్ ఎక్స్‌టీరియర్ కారును బయటకు తీశారు. అందులో మనిషి ఎముకలు కనిపించాయి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపగా... అవి విలియం మోల్ట్‌వి అని తేలింది. ఇలా 22 ఏళ్ల కిందట మిస్సైన మోల్ట్... గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చివరకు శవమై కనిపించాడన్నమాట.

Google Earth, william moldt, missing mystery, 22 years, florida, america, lake, car, గూగుల్ ఎర్త్, విలియం మోల్ట్, మిస్సింగ్ మిస్టరీ, 22 ఏళ్లు, ఫ్లోరిడా, సరస్సు, కారు, హత్య, మర్డర్, ఆత్మహత్య, ఎలా, దర్యాప్తు,
గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజ్‌లో కనిపిస్తున్నకారు (Source - Google Earth)


1997లో నైట్ క్లబ్ నుంచీ విలియం బయలుదేరాడు. తను ఇంటికి వస్తున్నానని తన గర్ల్‌ఫ్రెండ్‌కి కాల్ చేసి చెప్పాడు. కారులో బయలుదేరిన అతను ఇంటికి మాత్రం వెళ్లలేదు. అతను ఇంటికి రాకముందే... అక్కడికి దగ్గర్లోనే ఆ సరస్సు ఉంది. అతను తాగిన మత్తులో డ్రైవింగ్ చేస్తూ... కారును సరస్సులోనికి పోనిచ్చాడా? లేక... ఎవరైనా మోల్ట్‌ని చంపేసి కారుతో సహా సరస్సులోకి పంపేశారా అన్నది తేలాల్సి ఉంది.

గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజ్‌లో కనిపిస్తున్నకారు (Source - Google Earth)


చిత్రమేంటంటే... ఆ సరస్సు చుట్టుపక్కల చాలా ఇళ్లు ఉన్నాయి. వాళ్లెవరికీ అందులో ఓ కారు ఉన్నట్లు ఇన్నాళ్లూ తెలియదు. పోలీసులు కూడా కారులో వెళ్లిన మోల్ట్ ఏమైపోయాడని వెతికారే తప్ప... సరస్సులోకి కారు వెళ్లి ఉంటుందనే ఆలోచన రాలేదు. అలాంటి ఆలోచన వచ్చే అవకాశాలు కూడా అప్పట్లో కలగలేదు. ఈ మిస్టీరియస్ మిస్సింగ్ కేసును గూగుల్ ఎర్త్ పరిష్కరించడం సెన్సేషనే.
First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading