Home /News /crime /

Shocking Incident: పెళ్లికి వెళ్లి బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా ఊహించని ఘటన

Shocking Incident: పెళ్లికి వెళ్లి బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా ఊహించని ఘటన

అరుణ్ షా, సంజూ దేవీ

అరుణ్ షా, సంజూ దేవీ

బీహార్‌లో దారుణం జరిగింది. చప్రాలోని భేల్దీ ప్రాంతంలో ఉన్న జాఫర్‌పూర్‌లో గోల్డ్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. అతనిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. ముఖంపై 40 సార్లు పొడిచినట్లు తేలింది.

  చప్రా: బీహార్‌లో దారుణం జరిగింది. చప్రాలోని భేల్దీ ప్రాంతంలో ఉన్న జాఫర్‌పూర్‌లో గోల్డ్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. అతనిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. ముఖంపై 40 సార్లు పొడిచినట్లు తేలింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అరుణ్ షా అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లికి వెళ్లి స్నేహితుడితో కలిసి తెల్లవారుజామున తిరిగి ఇంటికి వస్తున్నాడు. అతను తిరిగి వస్తున్న క్రమంలో నిందితులు అరుణ్ షాను చుట్టుముట్టారు. అతని స్నేహితుడు తప్పించుకుని పారిపోయాడు. వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అయితే.. స్పాట్‌కు అందరూ చేరుకునేలోపే ఘోరం జరిగిపోయింది. అతనిని అత్యంత కిరాతకంగా హతమార్చి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అతని మొబైల్ ఫోన్ కనిపించకుండాపోయింది. అరుణ్ షా మృతదేహానికి కొద్ది దూరంలో అతని బైక్, హెల్మెట్, షూస్ పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  అరుణ్ షా స్నేహితుడు ఆశిష్ శ్రీవాత్సవను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్పీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవహారాల్లో నెలకొన్న విభేదాల వల్లే ఈ హత్య జరిగి ఉండొచ్చని చెప్పారు. ఈ కేసులో పలువురిని విచారిస్తున్నామని.. హత్యకు గురైన అరుణ్ షా ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. అరుణ్ షా సోదరుడు మంతు కుమార్ మాట్లాడుతూ.. తన సోదరుడికి ఎవరితోనూ శత్రుత్వం లేదని.. చివరిగా తన స్నేహితుడితో కలిసి వెళ్లాడని.. తాము స్పాట్‌కు చేరుకునే సరికి అరుణ్ షా మృతదేహం కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అరుణ్ షాకు ‘అవినాష్ జువెలర్స్’ పేరుతో నగల దుకాణం ఉంది. ఇదిలా ఉండగా.. అరుణ్ హత్యను నిరసిస్తూ అతని మృతదేహంతో చప్రా-ముజఫర్‌పూర్ నేషనల్ హైవే 722పై కుటుంబ సభ్యులు దాదాపు 2 గంటల పాటు ధర్నాకు దిగారు. దీంతో.. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని, కఠినంగా శిక్ష పడేలా చూస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో అరుణ్ కుమార్ షా కుటుంబ సభ్యులు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  ఇది కూడా చదవండి: Marriage: ఈ పెళ్లి ఫొటో చూస్తే అస్సలు ఆ డౌటే రావడం లేదు కదా.. కానీ పెళ్లైన రెండో రోజే ఏమైందో చూడండి..

  భర్త మృతదేహాన్ని చూడగానే అరుణ్ షా భార్య సంజూ దేవీ కుప్పకూలిపోయింది. కొంతసేపటి తర్వాత తేరుకున్న ఆమె భర్త మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించింది. అరుణ్ షాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. అరుణ్ షా హత్యతో అతని స్వగ్రామమైన గావాంద్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అరుణ్ షా కొడుకు పేరు అవినాష్. అతని పేరుతోనే నగల దుకాణం ప్రారంభించాడు. అంతా సాఫీగా సాగిపోతున్న వేళ అరుణ్ షా హత్యకు గురికావడం అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సదర్ హాస్పిటల్‌లో అరుణ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అరుణ్ తలపై, గొంతులో పలుమార్లు పొడిచి చంపినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా అరుణ్ ముఖాన్ని ఛిద్రం చేసి, గాయపరచిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bihar, Brutally murder, Crime news, Wedding

  తదుపరి వార్తలు