బంగారం స్మగ్లింగ్: జీన్సు ప్యాంటులో గోల్డ్ పేస్టు...ఎయిర్‌పోర్టు అధికారులకు షాక్...

బంగారాన్ని పేస్టుగా రూపంలో ప్రత్యేకంగా కుట్టించిన జీన్స్‌ప్యాంట్‌లో దాచి ప్రయాణికుడు స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బంగారం తీసుకొచ్చిన ప్రయాణికుడితోపాటు అతడిని రిసీవ్ చేసుకోవాడినికి వచ్చిన వ్యక్తిని సైతం గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

news18-telugu
Updated: October 16, 2019, 10:46 PM IST
బంగారం స్మగ్లింగ్: జీన్సు ప్యాంటులో గోల్డ్ పేస్టు...ఎయిర్‌పోర్టు అధికారులకు షాక్...
బంగారం స్మగ్లింగ్
  • Share this:
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ఎత్తున స్మగ్లింగ్ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు అరకిలోకుపైగా బంగారాన్ని పేస్టు రూపంలో చేసి తరలిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. స్మగ్లింగ్ కు బాధ్యులైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడి వద్ద సుమారు 653 గ్రాముల బంగారాన్ని గుర్తించామని, దానివిలువ రూ.24 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. అయితే బంగారాన్ని పేస్టుగా రూపంలో ప్రత్యేకంగా కుట్టించిన జీన్స్‌ప్యాంట్‌లో దాచి ప్రయాణికుడు స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

బంగారం తీసుకొచ్చిన ప్రయాణికుడితోపాటు అతడిని రిసీవ్ చేసుకోవాడినికి వచ్చిన వ్యక్తిని సైతం గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులను శంషాబాద్ పోలీసుల కస్టడీలో ఉంచారు.
First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading