GOLD SMUGGLING MUMBAI AIRPORT OFFICIALS SEIZED 481 GRAMS GOLD FOIL OF 24 KARAT GOLD ROM A PASSENGER FROM DUBAI NK
Gold Smuggling: వార్నీ... దిమ్మతిరిగేలా బంగారం స్మగ్లింగ్... వీడియో చూడండి
దిమ్మతిరిగేలా బంగారం స్మగ్లింగ్...
Gold Smuggling: ఎయిర్‌పోర్టుల్లో దొంగ బంగారాన్ని అధికారులు పట్టుకుంటున్న కేసులు రోజూ వస్తూనే ఉన్నా... రకరకాల మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. వీళ్లు ఎలా చేశారో చూడండి.
దుబాయ్‌లో బంగారం చాలా చవక. అందువల్ల అక్కడి నుంచి ఇండియాకి బంగారం తెచ్చుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. ఐతే... దానికి కొన్ని లెక్కలున్నాయి. ఎంత పడితే, అంత తెచ్చుకోవడానికి వీల్లేదు. ఇండియాకి వచ్చాక బంగారానికి కస్టమ్స్ సుంకాలు ఇతరత్రా ఉంటాయి. అవన్నీ వేస్తే... అక్కడి నుంచి గోల్డ్ తెచ్చుకోవడం వేస్ట్ అనే భావన కలుగుతుంది. అందుకే చాలా మంది ఎయిర్ పోర్ట్ అధికారుల కళ్లు గప్పి... రహస్యంగా బంగారాన్ని తేవడానికి ట్రై చేస్తుంటారు. కానీ... అధికారులు చాలా తెలివైన వాళ్లు, పైగా వాళ్ల దగ్గర టెక్నాలజీ ఓ రేంజ్లో ఉంటోంది. అందుకే రోజూ ఇలాంటి స్మగ్లింగ్ కేసులు ఈజీగా దొరికిపోతున్నాయి. తాజాగా అలాంటి మరో కేసును ముంబై పోలీసులు ఛేదించారు.
దుబాయ్ నుంచి EK 500 ఫ్లైట్ వస్తోందని ఎనౌన్స్మెంట్ వచ్చింది. రెండు నిమిషాల్లో ఆ ఫ్లైట్ రివ్వున దూసుకొచ్చి ల్యాండ్ అయ్యింది. ఇండియాలో కరోనా మళ్లీ పెరుగుతుందా, ఏమో అనుకుంటూ అధికారులు ఏదో మాట్లాడుకుంటుంటే... ఓ ప్రయాణికుడు విమానం దిగి... ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. మధ్యలో ఓ చోట స్కానింగ్ యంత్రాలు ఉన్నాయి. సో వాట్ అనుకుంటూ అలా వెళ్లాడు. స్కానింగ్ యంత్రాలు... కీక్ కీక్ అన్నాయి. అది కామనే కాబట్టి... ఎవరికి వాళ్లు పెద్దగా పట్టంచుకోలేదు.
దిమ్మతిరిగేలా బంగారం స్మగ్లింగ్... (చాక్లెట్ల ప్యాకెట్ల అట్టల్లో బంగారం పొరలు)
స్కానింగ్ వస్తువులను చూపే కంప్యూటర్ దగ్గర ఓ సన్నటి ఉద్యోగి కూర్చున్నాడు. అక్కడి యంత్రంలో... లగేజీలో ఏవో బాక్సులు కనిపించాయి. అ లగేజీ... ఆ ప్రయాణికుడిది కావడంతో... హలో అంటూ అతన్ని ఆపి... ఆ బాక్సుల్లో ఏమున్నాయి అని అడిగాడు. చాకొలెట్స్ అన్నాడు ప్రయాణికుడు. అంటూ వెళ్లిపోతుంటే... అక్కడికి దగ్గర్లోనే ఉన్న అధికారులకు ఆ సన్నటి వ్యక్తి సైగ చేశాడు. అంతే... అధికారులు అతన్ని ఆపేసి... చాకొలెట్స్ ఏ కంపెనీవో చూపించండి. అన్నారు. దాంతో అతను... వై నాట్... అంటూ చూపించాడు.
దిమ్మతిరిగేలా బంగారం స్మగ్లింగ్...
అవి చూస్తే పుల్ల చాక్లెట్లలా ఉన్నాయి. అంత కాస్ట్లీ కాదు. అలాంటివి ఇండియాలో ఎక్కడైనా దొరుకుతాయి. మరి వాటిని దుబాయ్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? అనే డౌట్ అధికారులకు వచ్చింది. అంతలోనే అక్కడికి వచ్చిన సన్నటి వ్యక్తి... ఆ బాక్సుల్లో కార్బన్ కోటింగ్ కనిపిస్తోంది అని చెప్పాడు. అవునా అంటూ అధికారులు. అతన్ని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు.
కార్బన్ కోటింగ్ ఏంటి:
జనరల్‌గా బంగారాన్ని దాచేవాళ్లు... పైన కార్బన్ పేపర్ కోటింగ్ చేస్తారు. అందువల్ల స్కానింగ్ యంత్రాల్లో కార్బన్ పేపర్ కోటింగ్ కనిపిస్తుందే తప్ప బంగారం కనిపించదు. అందువల్ల ఎవరైనా కార్బన్ కోటింగ్ చేస్తే... అందులో ఏదో మతలబు ఉందని అధికారులు భావిస్తారు. ఇక్కడా అదే జరిగింది. ఆ ప్రయాణికుడు తెచ్చిన చాక్లెట్ ప్యాకెట్లను ఓపెన్ చేశారు. చాలా ఉన్నాయి. ప్రతీ ప్యాకెట్ అట్టల్లో బంగారాన్ని సన్నటి పొరలా చేసి... లోపల సెట్ చేసి... పైన కార్బన్ కోటి వేసి... ఆ తర్వాత చాక్లెట్ అట్టలా సెట్ చేశాడు. ఇలా చాలా పొరల బంగారం దొరికింది. అవన్నీ తూకం వేస్తే అత్యంత ప్యూర్ (24 క్యారెట్లు) బంగారం 481 గ్రాములు ఉన్నట్లు తేలింది. దాన్ని సీజ్ చేసిన అధికారులు... అతనిపై చర్యలు తీసుకుంటున్నారు. వీడియో చూడండి.