GOLD SMUGGLING 2 PASSENGERS HIDE GOLD IN RECTUM CAUGHT AT CHENNAI AIRPORT MS
Gold Smuggling: ఆఖరికి అక్కడ కూడా దాస్తున్నారా..? బంగారం స్మగ్లింగ్ లో ఇది వేరే లెవల్..
ప్రతీకాత్మక చిత్రం
Gold Smuggling: బంగారాన్ని దాచడంలో ఒక్కో దొంగది ఒక్కో స్టైల్. కానీ ఈ స్మగ్లర్లు మాత్రం వేరే లెవల్ లో ఆలోచించారు. బయటి వస్తువులలో ఎక్కడ దాచినా పోలీసులు అనుమానిస్తున్నారని ఏకంగా శరీరంలోని కీలక పార్టులో దాచారు.
బంగారం స్మగ్లింగ్ చేయడంలో ఒక్కో దొంగది ఒక్కో స్టైల్. గతంలో షూ లలో, బ్రీఫ్ కేసులలో, బెల్టు సందులలో దాచే దొంగలు.. కొద్దిరోజులుగా అప్డేట్ అవుతున్నారు. కొద్దికాలంగా వీరి దొంగతనాల తెలివి చూసి పోలీసులకే మతి పోతున్నది. N 95 మాస్కులలో, ప్యాంటు జిబ్బులలో, చెప్పులలో... ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇక ఈ స్మగ్లర్లు మాత్రం వేరే లెవల్ లో ఆలోచించారు. బయటి వస్తువులలో ఎక్కడ దాచినా పోలీసులు అనుమానిస్తున్నారని ఏకంగా శరీరంలోని కీలక పార్టులో దాచారు. ఇందులో వింతేముంది..? సినిమాల్లో చూస్తున్నాం కదా..? అనుకుంటున్నారా..? కానీ ఇది మీ ఊహకు కూడా అందదు.
చెన్నై విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... దుబాయ్ నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు స్మగ్లర్ల నుంచి రూ. 85 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1.42 కిలో గ్రాముల బంగారాన్ని వారి దగ్గర లభ్యమైంది. కాగా అందులో కొంత బంగారాన్ని ఆ ఇద్దరు దొంగలు పురుష నాళంలో దాయడం గమనార్హం. బంగారంతో పాటు వారి దగ్గర్నుంచి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.