శంషాబాద్ ఎయిర్ పోర్టులో 4.9 కేజీల బంగారం స్వాధీనం...

నిందితుల వద్ద నుంచి 4.9 కిలోల విలువైన 42 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శంషాబాద్ పోలీసులకు అప్పగించామని డిఆర్ఐ అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

news18-telugu
Updated: October 5, 2019, 8:12 PM IST
శంషాబాద్ ఎయిర్ పోర్టులో 4.9 కేజీల బంగారం స్వాధీనం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం భారీగా అక్రమ బంగారం తరలిస్తుంటే అధికారులు జప్తు చేసారు. సుమారు 4.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డిఆర్ఐ అధికారులు మీడియాకు తెలిపారు. పట్టుబడిన ఈ బంగారం విలువ రూ.1.85 కోట్లు వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులు నుంచి బిస్కెట్ల రూపంలో తరలిస్తున్న అక్రమబంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 4.9 కిలోల విలువైన 42 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శంషాబాద్ పోలీసులకు అప్పగించామని డిఆర్ఐ అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

First published: October 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు