హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime News: అత్తా కోడ‌ళ్లు సీరియ‌ల్ చూస్తూ కుర్చున్నారు.. ఇంత‌లో..!

Crime News: అత్తా కోడ‌ళ్లు సీరియ‌ల్ చూస్తూ కుర్చున్నారు.. ఇంత‌లో..!

Robbery | టీవీ సీరియ‌ల్‌లు చూడ‌డం చాలా మందికి అలవాటు. అయితే సీరియ‌ల్స్ చూస్తూ చుట్టు ఉన్న ప్ర‌దేశాన్ని మ‌ర్చిపోతే మొద‌టికే మోసం వ‌స్తుంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు తర‌చుగా ప‌లు చోట్ల వెలుగులోకి వ‌స్తున్నాయి.

Robbery | టీవీ సీరియ‌ల్‌లు చూడ‌డం చాలా మందికి అలవాటు. అయితే సీరియ‌ల్స్ చూస్తూ చుట్టు ఉన్న ప్ర‌దేశాన్ని మ‌ర్చిపోతే మొద‌టికే మోసం వ‌స్తుంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు తర‌చుగా ప‌లు చోట్ల వెలుగులోకి వ‌స్తున్నాయి.

Robbery | టీవీ సీరియ‌ల్‌లు చూడ‌డం చాలా మందికి అలవాటు. అయితే సీరియ‌ల్స్ చూస్తూ చుట్టు ఉన్న ప్ర‌దేశాన్ని మ‌ర్చిపోతే మొద‌టికే మోసం వ‌స్తుంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు తర‌చుగా ప‌లు చోట్ల వెలుగులోకి వ‌స్తున్నాయి.

  టీవీ సీరియ‌ల్‌ (TV Serials) లు చూడ‌డం చాలా మందికి అలవాటు. అయితే సీరియ‌ల్స్ చూస్తూ చుట్టు ఉన్న ప్ర‌దేశాన్ని మ‌ర్చిపోతే మొద‌టికే మోసం వ‌స్తుంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు తర‌చుగా ప‌లు చోట్ల వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా త‌మిళ‌నాడులోని కాంచీపురంలో అత్తాకోడ‌ళ్లు టీవీ సీరియ‌ల్ చూస్తూ కూర్చున్నారు. ఇదే అద‌నుగా దొంగ‌లు ఇంట్లోకి వ‌చ్చి ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.19ల‌క్ష‌ల విలువైన బంగారాన్ని ఎత్తు కెళ్లారు. ఇక ఈ కేసులో నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. మెగానాథ్ ఆడిట‌ర్‌ (Auditor) గా ప‌ని చేస్తున్నాడు. అత‌ని సోద‌రుడు ప్ర‌భుత్వ ఉద్యోగి. ఈ ఇంట్లో మెనానాథ‌న్ భార్య‌, ఆమె కోడ‌లు ఉన్నారు. గురువారం రాత్రి వారిద్ద‌రూ టీవీ సీరియ‌ల్ చూస్తూ కుర్చున్నారు. సీరియ‌ల్ చూడాల‌నే ఆలోచ‌న‌లో ఇంటి మెయిన్ గేట్‌కు తాళం వేయ‌డం మ‌ర్చిపోయారు

  ఇదే అద‌నుగా దొంగ‌లు కొంద‌రు వారు చూడ‌కుండా ఇంటిలోకి చొర‌బ‌డ్డారు. ఈ స‌మ‌యంలో అత్తా కోడ‌లు ఫుల్ వాల్యూమ్‌తో సీరియ‌ల్ చూస్తున్నారు.

  Hyderabad Crime Report: హైద‌రాబాద్ లో అత్య‌ధిక సైబ‌ర్ క్రైమ్ కేసులు.. పోలీసు క్రైమ్ వార్షిక రిపోర్ట్ లో సంచ‌ల‌న నిజాలు.. 


  ముసుగు ధ‌రించిన దొంగ‌లు వారిని ప‌ట్టుకొని క‌త్తితో బెదిరించారు. వారి వ‌ద్ద నుంచి తాళాలు లాక్కున్నారు. అనంత‌ర వారు సుమారు. రూ.19ల‌క్షల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు తీసుకొని ఉడాయించారు. దీంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. నిందితులు ద్విచక్రవాహనాలపై ఇంటికి వచ్చినట్లు సీసీటీవీ (CC TV) ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. ఇద్దరు గేటు బయట కాపలా ఉండగా.. మరో ఇద్దరు దొంగచాటుగా లోపలికి చొరబడి దొపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

  అంకుల్ అని పిలిచినందుకు చిత‌క‌బాదాడు..

  గ‌తంలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో భాగంగా ఉన్న ఉత్త‌రాఖండ్‌ (Uttar Khand) లో మ‌రో వింత ఘ‌ట‌న చేసుకొంది. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని సితార్‌గంజ్ పట్టణంలో జ‌రిగింది. మోహిత్ కుమార్ అనే వ్య‌క్తి జ‌న‌ర‌ల్ స్టోర్ షాప్ నిర్వ‌హిస్తున్నాడు. అత‌ని వ‌య‌సు 35 ఏళ్ల వ‌య‌సు ఉంది. డిసెంబ‌ర్ 19న ఓ అమ్మాయి. బ్యాడ్మింట‌న్ ఆడుతుండ‌గా బ్యాట్ రాకెట్ తీగ‌లు తెగిపోయాయి. ష‌టిల్ రాకెట్ తీగ‌లు స‌రి చేసుకోవ‌డానికి షాపుల కోసం బ‌య‌ట‌కు వెళ్లింది.  అలా వెతుకుతూ పట్ట‌ణంలోని ఖతిమా రోడ్‌లో ఉన్న మోహిత్ కుమార్ షాప్‌కు వెళ్లింది.

  అంకుల్ అని మోహిత్ కుమార్‌ను పిలిచింది. దీంతో మోహిత్‌కుమార్ తీవ‌క్ర‌గా కోపం తెచ్చుకొన్నాడు. ఆవేశం ఆపుకోలేక ఆ అమ్మాయిన దారుణంగా కొట్టాడు. దీంతో అమ్మాయికి గాయాలు అయ్యాయి. ఆమెను ద‌గ్గ‌ర‌లో ఉన్న ఆస్ప‌త్రిలో చేర్చారు. ఈ విష‌యాన్ని కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక వ‌ద్ద ఫిర్యాదు స్వీక‌రించారు. దితుడు మోహిత్ కుమార్‌పై IPC సెక్షన్ 354, సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) మరియు సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.

  First published:

  Tags: Gold robbery, Robbery, Tamilnadu

  ఉత్తమ కథలు