ఆడవాళ్లే అతని టార్గెట్... 1000 కేజీల బంగారంతో పరార్...

Tamilnadu Crime : ఈ రోజుల్లో కూడా ఇంతలా మోసం చేయగలిగేవాళ్లు ఉంటున్నారంటే నమ్మలేం. కానీ మోసపోయే ప్రజలు ఉన్నంతకాలం... మోసగాళ్లు కూడా ఉంటారని నిరూపిస్తోంది ఈ కేసు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 2:35 PM IST
ఆడవాళ్లే అతని టార్గెట్... 1000 కేజీల బంగారంతో పరార్...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 2:35 PM IST
తమిళనాడు... చెన్నై... టీనగర్ వెస్ట్ మాంబళంలో ఓ చిన్న షాపు ఉంది. దాని పేరు రూబీ బ్యాంకర్స్. ఆ షాపు నడుపుతున్నది రెహమాన్, అతని కొడుకులు అనీస్, సయ్యద్. ఏకంగా 15 ఏళ్ల నుంచీ షాపు అక్కడే ఉండటంతో... అందరికీ దానిపై నమ్మకం బాగా పెరిగింది. దానికి తోడు షాపు ఓనర్... బంగారు నగలను తాకట్టు పెట్టే వాళ్ల దగ్గర వడ్డీ తీసుకోకుండా రుణాలు ఇస్తున్నాడు. ఎందుకూ అంటే... దేవుడు చెప్పింది తాను పాటిస్తున్నాననీ, రుణాలపై వడ్డీ తీసుకోవద్దని దైవం చెబుతోందనీ షాపులో రాసి ఉంచాడు. అది చూసిన వాళ్లంతా... వావ్... ఈ రోజుల్లో ఇలాంటి మంచివాళ్లు ఉంటారా... అనుకుంటూ... బంగారాన్ని కుదువ పెట్టి... డబ్బు అప్పు తీసుకొని... తిరిగి ఎప్పుడో చెల్లించి... బంగారాన్ని తిరిగి తీసుకుంటున్నారు. ఇలా 15 ఏళ్లుగా వ్యవహారం సాగుతోంది. ఐతే... 10 వేల రూపాయల బంగారాన్ని తాకట్టు పెడితే... ఇచ్చే డబ్బు మాత్రం 5 వేలే. ప్రజలు కూడా పోనీలే... వడ్డీ తీసుకోవట్లేదు కదా... అని... 5 వేలు చెల్లించి... తిరిగి తమ బంగారం తాము తీసుకుంటున్నారు. ఇలా నడవసాగింది అతని వ్యాపారం.

బంగారం విలువలో మూడోవంతు మొత్తాన్ని 3 నెలలు, 6 నెలలు, ఏడాది కాలంలో చెల్లించేలా రుణాలు ఇచ్చాడు. వడ్డీ లేని రుణాలపై ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో పాంప్లెట్లతో ప్రచారం కూడా చేశాడు. ఈ ప్రచారాన్ని నమ్మిన ముస్లింలు సుమారు 1000 కేజీల బంగారు నగలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారు.

ఎవరైనా లాభం లేకుండా బిజినెస్ చేస్తారా... అలా చేస్తున్నారంటే ఆ బిజినెస్‌లో ఏదో తిరకాసు ఉన్నట్లే. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించలేదు. ప్రజలు ఇచ్చిన నగలను ఆ వ్యాపారి... ప్రైవేట్ ఫైనాన్స్‌ కంపెనీల్లో అనేక కోట్ల రూపాయలకు తాకట్టుపెట్టాడు. ఆ డబ్బుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాడు. రుణాలు తిరిగి చెల్లించి నగలు తీసుకోవాలనుకునే వారికి వెంటనే డబ్బు ఇవ్వకుండా ఆలస్యం చెయ్యసాగాడు. ఇదేదో తిరకాసులా ఉందని ఓ బాధితుడు మద్రాస్ హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో కోర్టు... రూబీ బ్యాంకర్స్‌కు సీలువేసింది.

ట్విస్ట్ ఏంటంటే... తన వ్యాపారం దివాలా తీసిందంటూ... IP పెట్టాడు దాని యజమాని రెహమాన్. అది చూసిన ప్రజలు... షాకయ్యారు. మే 2న నగలు కచ్చితంగా వెనక్కి ఇస్తామని చెప్పిన ఆ కుటుంబ సభ్యులు... రూబీ బ్యాంకర్స్‌ను బోర్డు తిప్పేసి... రాత్రికి రాత్రి పారిపోయారు. ఏకంగా టన్ను (1000 కేజీలు) బంగారంతో పరారయ్యారు. టన్ను బంగారం అంటే దాదాపు రూ.300 కోట్ల రూపాయలు. 15 ఏళ్లుగా జనాన్ని నమ్మించి... ఒక్కసారిగా వాళ్లందర్నీ ముంచేశారన్నమాట.లబోదిబోమంటున్న బాధితులు... ఇప్పుడు చెన్నై పోలీస్ కమిషనర్‌ ఆఫీస్, మద్రాస్ హైకోర్టు దగ్గర బారులు తీరారు. వందకు పైగా కంప్లైంట్లు రావడంతో ఈ కేసును ఆర్థికనేరాల విభాగానికి అప్పగించారు.

 

ఇవి కూడా చదవండి :
Loading...

ఆ సమయంలో బయటకు రావొద్దు... వాతావరణ అధికారుల వార్నింగ్...


పనామాలో రూ.58 లక్షలు కొట్టేసింది తిరుచ్చి గ్యాంగ్... పోలీసుల అనుమానాలు...

Bigg Boss 3 : బిగ్ బాస్ 3 ఇప్పట్లో లేనట్లేనా...? జులై చివరి వరకూ ఆగాల్సిందేనా..?
First published: May 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...