అది ప్రఖ్యాత శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. నిత్యం వేలల్లో ప్రయాణికులు వస్తూ పోయే బిజీ ప్రాంతం.. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ తనిఖీలు క్షుణ్నంగా కొనసాగుతున్నాయి.. మరీ ముఖ్యంగా ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంది.. శుక్రవారం నాడు శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెండు జంటలు దిగాయి.. సుడాజ్ జాతీయులైన ఆ నలుగురు సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్ వచ్చారు. ఒమిక్రాన్ టెస్టుల క్రమంలో వారి కదలికలు, ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.. చివరికి ఆ ఇద్దరు మహిళలు సహా నలుగురి మలద్వారాల్లో బంగారం లభ్యమైంది. పరిమాణం రీత్యా, స్మగ్లింగ్ జరిగిన తీరు రీత్యా ఇలాంటి కేసు తొలిసారి కావడంతో అందరూ షాకయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పిన వివరాలివి..
భూమ్మీద లభ్యమయ్యే ఖనిజాల్లోకి అందరూ వాడే అత్యంత విలువైనది బంగారం కావడంతో, భూగోళమంతా దీని అక్రమరవాణా సాగుతుంటుంది. సైనిక, రాచరిక పాలనలోని దేశాల నుంచి విచ్చలవిడిగా బంగారం స్మగ్లింగ్ అవుతున్నది. మన దేశానికి ఎక్కువగా గల్ఫ్ నుంచి బంగారం వచ్చిపడుతుంటం తెలిసిందే. తాజాగా దుబాబ్ నుంచి హైదరాబాద్ కు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తోన్న నలుగురిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. అనూహ్యరీతిలో..
మలద్వారంలో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచుకుని అక్రమంగా తరలించారా నలుగురు. వాళ్లు రవాణా చేసిన బంగారం బరువు 7.3 కేజీలు కావడంతో అధికారులు అవాక్కయ్యారు. అదీగాక, మహిళలు సైతం మలద్వారంలో ఇంత పెద్ద పరిమాణంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం దాదాపు ఇదే తొలిసారి. అంతేకాదు, ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఒకేసారి ఇంత భారీ స్థాయిలో బంగారం పట్టుపడటం కూడా తొలిసారేనని అధికారులు చెప్పారు. మహిళలు, పరుషులు తమ మలద్వారంలో దాచుకుని తీసుకొచ్చిన బంగారం విలువ రూ.3.6కోట్లుగా ఉంటుందని అధికారులు అంచానా వేస్తున్నారు.
సుడాన్ కు చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ వచ్చారు. 7.3కిలోల బంగారాన్ని బిస్కెట్లతోపాటు కరిగించి పేస్ట్ రూపంలో మలద్వారంలో పెట్టుకుని శంషాబాద్ లో దిగారు. ఒమిక్రాన్ టెస్టుల క్రమంలో ఆ సుడాన్ జాతీయులపై భద్రతా సిబ్బందికి అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని క్షుణ్నంగా పరిశీలించారు. కానీ వాళ్ల దగ్గర బంగారమేదీ దొరకలేదు. దీంతో వైద్యుల సహాయం తీసుకున్నారు. డాక్టర్లు ఆ సుడానీస్ జంట మలద్వారం వద్ద పరిశీలించగా బంగారం పేస్ట్ బయటపడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.