ల్యాప్‌టాప్‌లో సీక్రెట్‌గా గోల్డ్ బిస్కెట్స్.. పక్కా నిఘాతో పట్టుకున్న పోలీసులు..

కస్టమ్స్ అధికారులు కొద్ది కాలంగా అతనిపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. అతనికి ఎలాంటి వ్యాపార లావాదేవీలు, ఉద్యోగం లేకపోయినా తరుచుగా మధ్య తూర్పు దేశాలకు ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు.

news18-telugu
Updated: February 10, 2019, 3:34 PM IST
ల్యాప్‌టాప్‌లో సీక్రెట్‌గా గోల్డ్ బిస్కెట్స్.. పక్కా నిఘాతో పట్టుకున్న పోలీసులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ల్యాప్‌టాప్‌ బ్యాటరీ‌ ర్యాక్ కింద బంగారు బిస్కెట్లను పెట్టి సీక్రెట్‌గా తరలిస్తున్న ఓ వ్యక్తిని కొచ్చి ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ల్యాప్‌టాప్ నుంచి 22 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండున్నర కిలోల బరువున్న ఈ బంగారం విలువ దాదాపు రూ.85లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.

దుబాయి నుంచి ఇండిగో విమానంలో కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగిన ఓ కేరళ వాసి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు కొద్ది కాలంగా అతనిపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. అతనికి ఎలాంటి వ్యాపార లావాదేవీలు, ఉద్యోగం లేకపోయినా తరుచుగా మధ్య తూర్పు దేశాలకు ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు.

ఇదే క్రమంలో శనివారం దుబాయి నుంచి కొచ్చిలో దిగిన అతను కస్టమ్స్ అధికారులను చూసి తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. ఎయిర్‌పోర్ట్ టాయిలెట్‌లోకి వెళ్లి దాదాపు 30నిమిషాలు అక్కడే గడిపాడు. దాంతో అనుమానం వచ్చిన అధికారులు అతను బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. ల్యాప్‌టాప్‌ బ్యాగ్ తీసుకుని పరిశీలించగా.. అది బరువుగా ఉండటాన్ని గమనించారు.ల్యాప్‌టాప్ బయటకు తీసి పూర్తిగా పరిశీలించగా.. దాని బ్యాటరీ కింద ర్యాక్ కింద 22 బంగారు బిస్కెట్లు ఉండటాన్ని గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
First published: February 10, 2019, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading