‘ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురిపిస్తా’.. నమ్మేసిన హైదరాబాదీ..

ఒప్పందంలో భాగంగా మొదట రూ.6.5లక్షలు క్యాష్ ఇచ్చాడు. రెండున్నర లక్షల రూపాయల చొప్పున మరో రెండు చెక్కులు ఇచ్చాడు.

news18-telugu
Updated: May 12, 2019, 9:05 PM IST
‘ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురిపిస్తా’.. నమ్మేసిన హైదరాబాదీ..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 12, 2019, 9:05 PM IST
‘ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురిపిస్తా. ఎంత కావాలో చెప్పు. డబ్బు మొత్తం నువ్వే తీసుకో. వర్షం కురిపించాలంటే కొంచెం ఖర్చవుతుంది. ఆ ఖర్చు మాత్రం నువ్వు పెట్టుకో’ అంటూ ఓ స్వామీజీ చెప్పిన మాటలు నమ్మి ఓ హైదరాబాదీ నిండా మునిగాడు. హైదరాబాద్‌కు చెందిన దోడు సత్యనారాయణ అనే వ్యక్తి ఓ షాపులో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడిని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తనను ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఏమైనా మార్గం దొరుకుతుందా అంటూ ఆలోచించసాగాడు. ఈ క్రమంలో తనకు తెలిసిన సయ్యద్ జహంగీర్ అనే వ్యక్తి దగ్గర కూడా తన కష్టాలు ఏకరువు పెట్టాడు. అయితే, ఇలాంటి కష్టాలు తీర్చడానికి ఓ స్వామీజీ ఉన్నాడంటూ ఓ వ్యక్తి పేరు చెప్పాడు.

ఇద్దరూ కలసి మహరాష్ట్రలోని ఔరంగాబాద్ వెళ్లారు. అక్కడ ఓ స్వామీజీని కలిశారు. తన కష్టాలు మొత్తం ఆ స్వామీజీకి చెప్పాడు సత్యనారాయణ. అయితే, అదేమంత పెద్ద సమస్య కాదని.. తాను డబ్బుల వర్షం కురిపించి.. కష్టాలన్నీ తీరుస్తానని నమ్మబలికాడు. అయితే, అందుకు చాలా క్రతువు చేయాల్సి ఉంటుందని.. సుమారు రూ.15లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. అయితే, అసలు ఆకాశంలో నుంచి డబ్బుల వర్షం ఎలా కురుస్తుందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా సత్యనారాయణ.. ఆ స్వామీజీ చెప్పిన డీల్‌కు ఓకే చెప్పాడు.

వారు చేసుకున్న ఒప్పందంలో భాగంగా మొదట రూ.6.5లక్షలు క్యాష్ ఇచ్చాడు. రెండున్నర లక్షల రూపాయల చొప్పున మరో రెండు చెక్కులు ఇచ్చాడు. అవన్నీ తీసుకున్న ఆ మోసకారి స్వామీజీ.. క్రతువుకు అవసరమైన సామగ్రి తీసుకుని వస్తానని చెప్పి పరారయ్యాడు. ఔరంగాబాద్‌లో పోలీసులు ఆ స్వామీజీని పట్టుకుంటే, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...