గోదావరిఖనిలో వైద్యులారి నిర్లక్ష్యంతో బాలింత ప్రాణాలమీదకు...

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిండు గర్భిణికి నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసి ప్రాణాల మీదికి వచ్చే సరికి తన వల్ల కాదంటూ చేతులెత్తేసింది ఆ వైద్యురాలు.

news18-telugu
Updated: January 19, 2020, 10:12 PM IST
గోదావరిఖనిలో వైద్యులారి నిర్లక్ష్యంతో బాలింత ప్రాణాలమీదకు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వైద్యో నారాయణో హరి వైద్యులు దేవునితో సమానం అంటారు. అలాంటి వైద్యులు నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలితీసుకోపోయారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది ఈ ఘోరం.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిండు గర్భిణికి నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసి ప్రాణాల మీదికి వచ్చే సరికి తన వల్ల కాదంటూ చేతులెత్తేసింది ఆ వైద్యురాలు. ప్రసవానికి వచ్చిన మహిళలకు ఆపరేషన్ చేసి హడావిడిగా కుట్లు వేసి డాక్టర్ వెళ్ళిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను అబ్జర్వేషన్లో ఉంచి మెరుగైన వైద్యం అందించాల్సి ఉండగా అంతా బాగానే ఉంది అంటూ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ ముగిసిన వారం రోజులకు కుట్లు వేసిన చోట ఇన్ఫెక్షన్ రావడంతో సదరు డాక్టర్ చేతులెత్తేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలిని కరీంనగర్ కు తరలించి ఇన్ఫెక్షన్ అయిన భాగాన్ని తొలగించారు. గోదావరిఖనికి చెందిన వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం జరిగిందని బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని ని బంధువులు పెట్రోల్ బాటిల్ తో ధర్నాకు దిగారు. ఇంత జరుగుతున్న వైద్యురాలు వచ్చి వారికి నచ్చ చెప్పకపోగా తనకున్న పలుకుబడితో ధర్నా చేస్తున్న బాధితులను పోలీసుల సహాయంతో ఆసుపత్రి నుండి బలవంతంగా వెళ్లగొట్టారు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సదరు డాక్టర్ గదిలోకి వెళ్ళి తాళం వేసుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ ను శిక్షించి తమకు న్యాయం జరిగే లా చూడాలని బంధువులు కోరుతున్నారు.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు