• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • GODAVARI RIVER POLICE RESCUES A MAN WHO TRIES TO COMMIT SUICIDE IN RAMAGUNDAM SK

గోదావరి నదిలో దూకేందుకు యువకుడి యత్నం.. కాపాడిన పోలీసులు

నదిలో దూకేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

గోదావరి నదిలో దూకి చనిపోయేందుకు ప్రయత్నించాడు. ఐతే అతడిని గమనించిన గోదావరి రివర్ పోలీసులు హుటాహుటిన పరుగుతీసి అతడిని కాపాడారు.

  • Share this:
    ఆత్మహత్య మహా పాపం..! కానీ ఈ సమాజంలో చిన్న చిన్న కారణాలకే చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒత్తిడిలో చిత్తవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఇలాగే ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. గోదావరి నదిలో దూకి చనిపోయేందుకు ప్రయత్నించాడు. ఐతే అతడిని గమనించిన గోదావరి రివర్ పోలీసులు హుటాహుటిన పరుగుతీసి అతడిని కాపాడారు. ఆ దృశ్యాలను బ్రిడ్జిపై వెళ్తున్న ఓ వాహనదారుడు వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

    ఆత్మహత్యాయత్నం చేసిన ఆ యువకుడిని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన 30 ఏళ్ల విజయ్‌గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలతో అతడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు. బ్రిడ్జికి కొంత దూరంలో ఉన్న కానిస్టేబుళ్లు రమేష్, శంకరయ్య అతడిని గమనించి.. నదిలో దూకకుండా అడ్డుకున్నారని వెల్లడించారు. విజయ్‌ను కాపాడిన కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించి.. ఇంటికి పంపించారు.
    First published: