Home /News /crime /

GOA FITNESS TRAINER KIDNAPS MURDERS CLIENT POLICE SUSPECT UNREQUITED LOVE PAH

మహిళ క్లోజ్ గా ఉంటుందని.. ఫిట్ నెస్ ట్రైనర్ ప్రపోజ్ చేశాడు.. తర్వాత ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Goa: ఫిట్ నెస్ ట్రైనింగ్ కోసం మహిళ.. ఒక యువకుడిని నియమించుకుంది. దీంతో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. చాలా క్లోజ్ గా ఉండే వారు. ఈ క్రమంలో అతను.. మహిళకు తన మనసులో మాట చెప్పాడు.

ప్రేమ (love) ఎప్పుడు ఎవరిమీద పుడుతుందో తెలియదు. కొందరు మాత్రం ప్రేమ పేరుతో షాడిస్ట్ లుగా ప్రవర్తిస్తారు. ఇష్టం లేదన్న.. వెంట పడతారు. ప్రేమించాలని అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు మరికొందరు ప్రేమను పావుగా ఉపయోగించుకుంటారు. అవతలి వారిని ప్రేమిస్తున్నట్లు (Love affair) నటిస్తారు. అవసరం తీరిపోయాక అవాయిడ్ చేస్తారు. మరికొంత మంది ఏదో ఒక వంకతో అమ్మాయిలకు దగ్గరవ్వాలని చూస్తుంటారు. ఇలాంటి ప్రేమకు సంబంధించిన అనేక మోసాలు తరచుగా వార్తలలో ఉంటునే ఉంటాయి. కొంత మంది మాత్రం.. మరీ షాడిస్ట్ లుగా.. ప్రేమను ఒప్పుకోలేదని (attack) దాడులు చేయడం, ప్రేమించిన వారిని హత్య చేయడానికి సైతం వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. గోవాలో (Goa) జరిగిన దారుణం జరిగింది. జూన్ 23 న జరిగిన అమానుషం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉండే గౌరీ ఆచారీ (35) అనే గవర్నమెంట్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తుంది. ఈక్రమంలో.. ఆమె ఒక ఫిట్ నెస్ ట్రైనర్ ను (Gym trainer) నియమించుకుంది. ప్రతి రోజు అతను ఇంటికి వచ్చి జిమ్ ట్రైన్ చేసేవాడు. కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నాడు. ఈ మధ్యలో అతను మహిళకు.. తాన.. లవ్ ప్రపోజల్ (Love propose)  గురించి చెప్పాడు.దీంతో మహిళ అతడిని గట్టిగా (Goa Fitness trainer) వార్నింగ్ ఇచ్చింది. పద్దతి మార్చుకొవాలని చెప్పింది. దీంతో అతను కోపం పెంచుకున్నాడు. జూన్ 23 న పనిమీద బైటకు మహిళను కారులో బైటకు తీసుకెళ్లాడు.ఆ తర్వాత.. నిర్మానుష్య ప్రాంతంలోనికి తీసుకెళ్లాడు. కారులోనే కత్తితో మహిళను పొడిచి చంపాడు. ఆతర్వాత.. శవాన్ని అడవిలో పడేశాడు.ఆ తర్వాత.. పారిపోయాడు. తన కూతురు ఇంటికి రాకపోవడంతో బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిట్ నెస్ ట్రైనర్ పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడిని అదుపులోనికి విచారించగా జరిగిన దారుణం వెలుగులోనికి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా కర్ణాటకలో ఒక బ్యాంకు మేనెజర్ యువతి హనీ ట్రాప్ వలలో పడ్డాడు.

ఇండియన్ బ్యాంక్ లో ఆడిట్ కు వచ్చిన అధికారులు డబ్బులు నిల్వలు తక్కువగా ఉండటంతో ఆరా తీయగా ఘటన వెలుగులోనికి వచ్చింది. బెంగళూరులోని హనుమంతనగర్‌లో ఉన్న ఇండియన్ బ్యాంక్ మేనెజర్ హరిశంకర్, డేటింగ్ యాప్ లో యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కాల్స్.. వరకు వెళ్లింది. హరిశంకర్ ఆమె బుట్టలో పడిపోయాడు. ఈ క్రమంలో.. తన ప్రియురాలి కోసం కస్టమర్ లు బ్యాంక్ లో పెట్టిన సోమ్మును ఆమె చెప్పిన అకౌంట్ లకు ట్రాన్స్ ఫర్ చేశాడు.

అతగాడు.. ఏకంగా .5.7 కోట్లను యువతి చెప్పిన అకౌంట్ లకు మళ్లించాడు. కాగా, మే 13 నుంచి 19 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్ లో 28 ఖాతాలకు, కర్ణాటకలోని 2 ఖాతాలకు.. మొత్తం 136 లావాదేవీల్లో డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా అతని పర్సనల్ డబ్బులు.. 12.5 లక్షలను కూడా ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హరిశంకర్ ను అరెస్టు చేశారు. అనేక కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Goa, Gym

తదుపరి వార్తలు