లక్కీగా బతికిపోయాడు, లేకపోతే ప్రణయ్, హేమంత్ తర్వాత మూడో వ్యక్తి అయ్యేవాడు

భైంసా మండలంలోని బిజ్జురు చింతల్ బోరి గ్రామాల మధ్య ద్విచక్రవాహనంపై వెళ్తున్న ప్రేమజంటను సినీ ఫక్కీలో వెనుక నుంచి కారుతో ఢీ కొట్టి , అక్షయ్ ను చితక బాది నాగజ్యోతిని కారులో తీసుకువెళ్లారు.

news18-telugu
Updated: October 9, 2020, 7:39 PM IST
లక్కీగా బతికిపోయాడు, లేకపోతే ప్రణయ్, హేమంత్ తర్వాత మూడో వ్యక్తి అయ్యేవాడు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అక్షయ్
  • Share this:
(కట్టా లెనిన్, న్యూస్ 18 కరస్పాండెంట్, ఆదిలాబాద్)

ప్రేమించి పెళ్ళి కూడా చేసుకొని హాయిగా కలిసి ఉంటున్న జంటను విడదీసేందుకు సినీ ఫక్కీలో ఆ జంటపై దాడి చేసిన సంఘటన నిర్మల్ జిల్లాలో కలకలం రేపింది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన నాగజ్యోతి, అక్షయ్ లు రెండు సంవత్సరాలు ప్రేమించుకొని గత సంవత్సరం మే 28న భైంసా పట్టణంలోని బుద్దవిహార్ లో పెళ్ళి కూడా చేసుకున్నారు. సంవత్సరన్నర పాటు భైంసా పట్టణంలో కలిసి జీవించారు కూడా. అయితే గత నెల రోజుల క్రితం నాగజ్యోతి తల్లి కి గుండెపోటు వచ్ఛిందని ఆమె కుటుంబీకులు నాగజ్యోతిని ఇంటికి పిలిపించుకున్నారు. అక్షయ్‌ను చంపుతామని బెదిరించి నాగజ్యోతిపై ఒత్తిడి తెచ్చి అతడితో ఆగస్టు నెలలో విడాకులు కూడా ఇప్పించారు. ఇదిలా ఉంటే కుంటాల మండలం కల్లూర్ లో పరీక్ష రాసేందుకు వెళ్లిన నాగజ్యోతి అక్షయ్ కి ఫోన్ చేసి అక్కడికి పిలిపించుకుంది. అక్షయ్ కల్లూరుకు చేరుకొని నాగజ్యోతిని తీసుకొని ద్విచక్రవాహనంపై ఇద్దరు భైంసా పట్టణానికి వస్తుండగా నాగజ్యోతి కుటుంబీకులు వారిని వెంబడించారు. భైంసా మండలంలోని బిజ్జురు చింతల్ బోరి గ్రామాల మధ్య ద్విచక్రవాహనంపై వెళ్తున్న ప్రేమజంటను సినీ ఫక్కీలో వెనుక నుంచి కారుతో ఢీ కొట్టి , అక్షయ్ ను చితక బాది నాగజ్యోతిని కారులో తీసుకువెళ్లారు. స్పృహలోకి వచ్చిన తర్వాత నాగజ్యోతి, తాను ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్నామని చెబుతున్నాడు. అక్షయ్ తండ్రి జనార్దన్ ఫిర్యాదు మేరకు పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం నల్లగొండ జిల్లాలో ప్రణయ్ హత్య కేసు పెను సంచలనానికి దారి తీసింది. దేశవ్యాప్త చర్చను లేవనెత్తింది. కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్, అమృతలు బాగానే ఉన్నా, అమృత తండ్రి కక్షగట్టి ప్రణయ్‌ను హత్య చేయించాడు. దీంతో పెద్ద దుమారం లేచింది. అత్యంత దారుణంగా జరిగిన ఈ ఘటన వీడియో కూడా అప్పుడు బయటకు వచ్చింది. కానీ, కొన్నాళ్ల తర్వాత మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు.

ఇటీవల హైదరాబాద్ చందానగర్‌‌‌‌లోని ‌‌తారానగర్‌‌‌‌కి చెందిన చింతయోగ హేమంత్‌‌కుమార్‌‌‌‌ (28) హత్యకు గురయ్యాడు. అదే ప్రాంతానికి చెందిన అవంతిరెడ్డి (23)ని అతడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరిదీ కులాంతర వివాహమే. అవంతిరెడ్డి జూన్‌‌10న ఇంటి నుంచి వెళ్లిపోయి హేమంత్‌‌ను రిజిస్టర్‌‌‌‌ మ్యారేజ్‌‌ చేసుకుంది. హేమంత్‌‌, అవంతి కలిసి గచ్చిబౌలిలోని టీఎన్‌‌జీవో కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అవంతి ప్రేమ పెళ్లి ఇష్టం లేని ఆమె తండ్రి లక్ష్మారెడ్డి తన బావమరిది గూడురు యుగేందర్‌‌‌‌ రెడ్డితో కలిసి హేమంత్‌‌ హత్య చేయించాడు. రూ.10 లక్షల సుపారీ ఇచ్చి మర్డర్ చేయించాడు. హంతకులు మూడు కార్లలో హేమంత్ ఇంటికి వచ్చి, ఇంట్లోకి చొరబడి అవంతి, హేమంత్‌‌పై దాడి చేశారు.

అనంతరం ఇద్దరిని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. లింగంపల్లిలోని బంధువు ఇంట్లో మాట్లాడుకుందామని దారిలో హేమంత్, అవంతిలకు వాళ్లు చెప్పారు. ఆ తర్వాత హేమంత్, అవంతి కారు దిగి పారిపోబోతుంటే హేమంత్‌‌ను అవంతి మేనమామ యుగేంధర్‌‌‌‌రెడ్డి వెంబడించి పట్టుకున్నాడు.
కారులోనే హేమంత్‌‌ ఊపిరి ఆడకుండా చేశారు. స్పృహ కోల్పో యిన తర్వాత మెడకు తాడు బిగించి హత్య చేశారు. తర్వాత జహీరాబాద్‌‌లో లిక్కర్, తాళ్లు కొన్నారు. డెడ్ బాడీని తాళ్లతో కట్టి, సంగారెడ్డి హైవేపై కిష్టాయిగూడెంలోని చెట్లపొదల్లో పడేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 9, 2020, 6:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading