Home /News /crime /

GIRLFRIENDS WEDDING WITH SOMEONE ELSE BOYFRIEND WHO SET HIMSELF ON FIRE IN HYDERABAD SK ABH

ఆమెను ప్రాణంగా ప్రేమించాడు.. కానీ మరో వ్యక్తితో పెళ్లి జరగడంతో.. ఫంక్షన్ హాల్ ముందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాను ప్రేమించి అమ్మాయికి పెళ్లయిపోతుందన్న బాధలో ఎంతో కుంగిపోయాడు. నువ్వు లేనిదే నేను ఉండలేనని ఫంక్ష‌న్ హాల్ వ‌ద్ద‌కు వెళ్లిన ఆ ప్రేమికుడు.. కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నాడు

    ఆ యువ‌కుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతోనే జీవితాంతం కలిసి ఉండాలని కలలు కన్నాడు. తనను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోకూడని బలంగా నిశ్చయించుకున్నాడు. కానీ ఆ యువ‌తికి కుటుంబ పెద్దలు మ‌రొక‌రితో వివాహం నిశ్చయించారు. పెళ్లి కూడా చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న ప్రియుడు.. షాక్ తిన్నాడు. తాను ప్రేమంచి యువతికి.. మరొకరితో పెళ్లవడాన్ని తట్టుకోలేకపోయాడు. అసలు ఈ జీవితమే వద్దనుకొని.. ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రియురాలికి వివాహం జ‌రుగుతున్న ఫంక్ష‌న్ హాల్ వ‌ద్ద‌కు వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘ‌ట‌న గురువారం రాత్రి లంగ‌ర్‌హౌజ్ మొగ‌ల్ ఫంక్ష‌న్ హాల్ వ‌ద్ద చోటు చేసుకుంది.

    శభాష్ రాకీ.. యజమాని పట్ల దీనికున్న విశ్వాసానికి పోలీసులు షాక్... ఏం చేసిందంటే..

    వివ‌రాల్లోకి వెళ్తే.. రాజేంద్ర‌న‌గ‌ర్‌కు చెందిన షేక్ ఆశ్వ‌క్‌(19), ఫాతిమా(19) గ‌త కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అంతలోనే ఈ విషయం ఫాతిమా కుటుంబ సభ్యులకు తెలిసింది. షేక్ అశ్వక్‌ను ఫాతిమా ప్రేమించడం వారికి అస్సలు నచ్చలేదు. అతడితో మాట్లాడకూడని వార్నింగ్ ఇచ్చారు. అయినా ఆమె పట్టించుకోలేదు. అశ్వక్‌తో తన ప్రేమాయణం కొనసాగించింది. తమ మాట వినికపోవడంతో తల్లిదండ్రులు కోపంతో ఊగిపోయారు. ఈ క్రమంలోనే మరొక అబ్బాయితో ఫాతిమాకు పెళ్లి నిశ్చయించారు. లంగ‌ర్‌హౌస్‌లోని మొగ‌ల్ ఫంక్ష‌న్ హాల్‌లో వివాహ వేడుక నిర్వహించారు.



    ఈ విష‌యం ఆశ్వ‌క్‌కు తెలియ‌డంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తాను ప్రేమించి అమ్మాయికి పెళ్లయిపోతుందన్న బాధలో ఎంతో కుంగిపోయాడు. నువ్వు లేనిదే నేను ఉండలేనని ఫంక్ష‌న్ హాల్ వ‌ద్ద‌కు వెళ్లిన ఆ ప్రేమికుడు.. కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పి, అత‌డిని ఆస్ప‌త్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అశ్వక్ పరిస్ధితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ కుమారుడు నిప్పటించుకున్నాడని తెలిసి.. అశ్వక్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఐతే అతడి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime, Crime news, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు