హోమ్ /వార్తలు /క్రైమ్ /

Love Cheater : ప్రియురాలికి అబార్షన్ చేయించి మరో యువతితో పెళ్లి .. పీటల మీదే చుక్కలు చూపించిన యువతి

Love Cheater : ప్రియురాలికి అబార్షన్ చేయించి మరో యువతితో పెళ్లి .. పీటల మీదే చుక్కలు చూపించిన యువతి

(LOVE CHEATER)

(LOVE CHEATER)

Marriage Dissolution: ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి చివరకు మరో యువతితో పెళ్లికి సిద్దపడ్డ ఓ యువకుడికి ప్రియురాలు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది.పెళ్లి కొడుకు తనను ప్రేమించినట్లుగా యువతి చూపించిన సాక్ష్యాధారలతో పెళ్లి కూతురు బంధువులు మోసగాడ్ని పీటల మీద చితకబాదారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mancherial, India

(K.Lenin,News18,Adilabad)

ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి చివరకు ప్రియురాలికి మొఖం చాటేసి, మరో యువతితో పెళ్లికి సిద్దపడ్డ ఓ యువకుడికి ప్రియురాలు అదిరిపోయే ట్విస్ట్(Twist)ఇచ్చింది. తెలుసు సినిమాలో పీటల మీద పెళ్లికి లవ్ కార్డుతో పుల్‌స్టాప్‌ పెట్టినట్లుగా పెళ్లి కొడుకు ప్రియురాలు చూపించిన సాక్ష్యాధారలు చూసి పెళ్లి కూతురు బంధువులు మోసగాడ్ని పీటల మీద చితకబాదారు. మంచిర్యాల(Manchiryala) జిల్లా క్యాతనపల్లి(Kytanapally)మునిస్పాలిటి పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌(Function Hall)లో వివాహ తంతు జరుగుతోంది. మంచిర్యాల జిల్లా గద్దెరాగడికి చెందిన బొద్దుల రాజేష్‌(Boddula Rajesh)తో వరంగల్‌ (Warangal)కు చెందిన అనూష(Anusha)వివాహం జరుగుతోంది. కల్యాణ మండపంలో బంధు మిత్రుల సమక్షంలో వివాహ తంతు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. వధువరులపై తలపై జీలకర్ర బెల్లం కూడా పెట్టారు. ఎట్టకేలకు వరుడు రాజేష్ వధువు అనూష మెడలో తాళి కట్టేందుకు సిద్దమైన సమయంలో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది.

Crime news : ఓ సైంటిస్ట్ చీకటి దందా గుట్టురట్టు .. ఇంట్లోనే ఆ దుకాణం పెట్టిన కేటుగాడుపీటల మీద పెళ్లి పెటాకులైంది..

పెళ్లి జరుగుతున్న కల్యాణ మండపంలో అడుగుపెట్టిన ఓ యువతి పెళ్లి కొడుకు రాజేష్‌ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని చెప్పింది. అంతే కాదు తనకు తెలియకుండా ఇపుడు మరో యువతిని పెళ్ళి చేసుకుంటున్నాడంటూ పెళ్లి కొడుకు ప్రియురాలు రమీనా మండపంలో జరుగుతున్న పెళ్లిని అడ్డుకుంది. ఈ పెళ్ళిని ఆపాలని రాజేష్‌కి తనకు మధ్య ఉన్న ప్రేమ వ్యవహారాన్ని అక్కడికి వచ్చిన బంధు, మిత్రులందరితో పూసగుచ్చినట్లుగా చెప్పింది. ఎనిమిదేళ్ళుగా ప్రేమించికంటున్నామని తనకు గతంలో మేనబావతో పెళ్ళి జరిగి విడాకులయ్యాయని, దీంతో తల్లివద్దే ఉంటున్నానని పేర్కోంది.

పెళ్లి కొడుకుకి ఝలక్ ఇచ్చిన ప్రియురాలు.

పెళ్లి పీటల మీద కూర్చున్న రాజేష్‌కు ఈ విషయం చెప్పినా తాను పెళ్ళి చేసుకుంటానని, తోడుగా ఉంటానని రాజేష్ నమ్మించాడని, తమ ఇద్దరి మధ్య శారీరకంగా కూడా సంబంధం కూడా వివరించింది. రాజేష్ పెళ్లి జరుగుతున్న విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టాడని, మొన్నటి వరకు తనలో ఫోన్ లో చాటింగ్ కూడా చేశాడని చెప్పింది. అయితే వారి బంధువులు వాట్సప్ లో పెట్టుకున్న స్టేటస్ ద్వారా పెళ్ళి విషయం తెలిసి ఇక్కడి వచ్చి పెళ్లిని ఆపేందుకు ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చించి. రాజేష్ తో తన పెళ్లి జరిపించాలని కోరింది.


Telangana : నో నార్మల్ కాల్స్ .. ఓన్లీ వాట్సాప్‌ కాల్స్ .. ఆ భయంతోనే ఈ ట్రిక్ ఫాలో అవుతున్న నేతలు


పీటల మీదే దేహశుద్ధి..

ఇక అసలు విషయం తెలిసిన పెళ్లి కూతురు బంధువులు మరో యువతిని ప్రేమించిన విషయం దాచి పెట్టి తమను మోసం చేసి మరో పెళ్ళికి సిద్దపడ్డావంటూ వరుడిని నిలదీశారు. దేహశుద్ది కూడా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకొని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ప్రియురాలిని పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్ళారు. ప్రియురాలి ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అప్పటి వరకు పెళ్లి హడావుడితో సందడిగా ఉన్న ఫంక్షన్‌హాలులో ఒక్కసారిగా నిశబ్ధం నెలకొంది.

First published:

Tags: Love cheating, Manchiryala, Telangana crime news

ఉత్తమ కథలు