Home /News /crime /

GIRLFRIEND TRIES TO COMMIT SUICIDE BY CONSUMING ANT MEDICINE AS BOYFRIEND SENDS LAWYER NOTICE REFUSING TO MARRY SSR

Lover: నాలుగేళ్లు ప్రేమించాడు.. లవర్‌తో నిశ్చితార్థం కూడా చేసుకుని ఆమె ఇంటికి ఏం పంపాడో చూడండి..

రాజేష్‌ (ఫైల్ ఫొటో)

రాజేష్‌ (ఫైల్ ఫొటో)

తమిళనాడులోని మయిలదుతురై జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ప్రియుడు పెళ్లికి నిరాకరిస్తూ లాయర్‌తో నోటీసులు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు యత్నించింది.

    చెన్నై: తమిళనాడులోని మయిలదుతురై జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ప్రియుడు పెళ్లికి నిరాకరిస్తూ లాయర్‌తో నోటీసులు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయిలదుతురై జిల్లాలోని బాలాజీ నగర్‌కు చెందిన ముత్తయ్య కూతురు దుర్గాదేవి(30). పీజీ చదివిన ఆమె ఓ ఆడిటర్ వద్ద ఆడిట్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో.. మయిలదుతురైలో ఓ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న రాజేష్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్నాళ్లకు స్నేహం కాస్తా ప్రేమగా మారింది. నాలుగేళ్ల నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడటంతో ఇరు కుటుంబాలు కూడా పెళ్లి ప్రతిపాదనకు అడ్డు చెప్పలేదు.

    ఇది కూడా చదవండి: Married Woman: ఈమె అత్త ఉదయం పొలానికి వెళితే చెరుకు తోటలో ఈమె ఏ స్థితిలో ఉందో చూసి షాక్..

    దుర్గాదేవి, రాజేష్‌కు ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే.. ఇంత జరిగాక రాజేష్, అతని కుటుంబం దుర్గాదేవికి ఊహించని షాకిచ్చారు. పెళ్లికి ‘నో’ చెప్పారు. అదేంటని అడిగితే.. మరింత కట్నం కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. రాజేష్‌ సెంబనార్కోయిల్‌కు ఉద్యోగ రీత్యా బదిలీ కావాల్సి వచ్చింది. దీంతో.. సెంబనార్కోయిల్ పోలీసులకు దుర్గాదేవి కుటుంబం ఫిర్యాదు చేసింది. నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి నిరాకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఇది కూడా చదవండి: OMG: పెళ్లయి ఒక బాబు ఉన్నాడు.. రెండోసారి గర్భం దాల్చింది.. కానీ ఏమైందంటే..

    పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కాంప్రమైజ్ కావాలని సూచించారు. ఈ క్రమంలో.. రాజేష్ తరపు న్యాయవాది దుర్గాదేవికి నోటీసులు పంపారు. ఆ నోటీసులో రాజేష్ వెర్షన్ చెప్పుకొచ్చిన సందర్భంలో.. కొందరు మగాళ్లతో చనువుగా మాట్లాడటం తనకు నచ్చలేదని.. తాను పెళ్లి చేసుకోలేనని దుర్గాదేవిపై పరోక్షంగా రాజేష్ అనుమానం వెలిబుచ్చాడు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన దుర్గాదేవి ఆత్మహత్యకు యత్నించింది. చీమల మందును తిని ఆత్మహత్యకు యత్నించిన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

    ఇది కూడా చదవండి: Perambalur: ఇదెక్కడి మూర్ఖత్వం.. 70 రూపాయల కోసం కన్న కూతురుని పొట్టనపెట్టుకున్నావ్ కదమ్మా.. ఈ ఇంట్లోనే..

    మయిలదుతురై గవర్నమెంట్ హాస్పిటల్‌లోని ఐసీయూలో ఆమె చికిత్స పొందుతోంది. రాజేష్, అతని కుటుంబం నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లికి నిరాకరించడంతో తన కూతురు ఆత్మహత్యకు యత్నించిందని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే.. రాజేష్, అతని కుటుంబం తరపు వాదన మరోలా ఉంది. ప్రేమ పేరుతో దుర్గాదేవి డబ్బు కోసం రాజేష్‌ను వాడుకుందని, ఆ డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు ఆమె ఈ ఆత్మహత్యా యత్నం పేరుతో వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తోందని చెప్పుకొచ్చారు. మయిలదుతురై పోలీసులు ఈ ఘటపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇరు కుటుంబాల్లో ఎవరి వాదనలో నిజముందనే విషయం త్వరలోనే తేలుతుందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గాదేవికి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Engagement, Love marriage, Lovers, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు