విశ్వనగరం హైదరాబాద్ లో పట్టపగలే మరో రక్తపాత ఘటన చోటుచేసుకుంది. సాధారణ సైకో ప్రేమికులకు భిన్నంగా ఈసారి ప్రియురాలే కత్తి దూసింది. ప్రేమ పేరుతో దగ్గరై, లైంగిక వాంఛలు తీర్చుకున్నాక ముఖం చాటేయాలని చూసిన బాయ్ ఫ్రెండ్ పై ఆమె పగపట్టింది. తనకు జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకునేందకు నేరం చేయడానికీ వెనుకాడలేదు. నగరంలోని ప్రఖ్యాత లంగర్ హౌజ్ ప్రాంతంలో, లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా చోటుచేసుకుందీ ఘటన.
బాయ్‌ఫ్రెండ్‌ను కత్తితో పొడిచిన ప్రేయసి ఉదంతానికి సంబంధించి లంగర్ హౌజ్ స్టేషన్ పోలీసులు చెప్పిన వివరాలివి. సిటీకి చెందిన ఓ యువ జంట కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య శారీరక బంధం కూడా ఏర్పడింది. కొన్ని నెలలుగా సాగుతోన్న ప్రేమ వ్యవహారంలో ఇటీవల పొరపొచ్చలు వచ్చాయి. లవర్స్ మధ్య మనస్పర్థలు పెరిగాయి. దీంతో..
అమ్మాయిని శారీరకంగా అనుభవించిన తర్వాత ప్రేమ వర్కౌట్ కావట్లేదంటూ ఆమెను దూరం పెట్టాడా యువకుడు. అతని చేతిలో మోసపోయానని భావించిన ఆ యువతి ప్రతీకారానికి దిగింది. మోసం చేశాడనే కోపంతో ప్రేమికుడిపై దాడి చేసిన యువతి అతణ్ని కత్తితో కసకసా పొడిచేసింది. రక్తపు మడుగులో పడిఉన్న యువకుడిని స్థానికులు గుర్తించి..
ప్రియురాలి దాడిలో తీవ్రంగా గాయపడి, రక్తస్తావం అవుతుండగా స్థానికులు అప్రమత్తమై ఆ యువకుడిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దాంతోపాటే పోలీసులకూ సమాచారం అందించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోన్న యుకుడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. అతనిని కత్తితో పొడిచిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.