హోమ్ /వార్తలు /క్రైమ్ /

Very Sad: ఆరేళ్ల నుంచి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ ఆ అమ్మాయి ఈ రేంజ్‌లో షాక్ ఇస్తుందని ఊహించలేకపోయాడు..

Very Sad: ఆరేళ్ల నుంచి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ ఆ అమ్మాయి ఈ రేంజ్‌లో షాక్ ఇస్తుందని ఊహించలేకపోయాడు..

రామ్ సింగ్ (ఫైల్ ఫొటో)

రామ్ సింగ్ (ఫైల్ ఫొటో)

ప్రేమ పుట్టడానికి కారణం అక్కర్లేదని అంటుంటారు. కానీ పెళ్లి అనే బంధానికి ప్రేమ పునాది లాంటిది. ప్రేమ అనే భావనను పెళ్లి వరకూ తీసుకెళ్లినప్పుడే వాళ్లు నిజమైన ప్రేమికులు. ఎన్ని కష్టనష్టాలను భరించైనా ప్రేమను వివాహం అనే పవిత్ర బంధానికి బాటగా మార్చుకోవాలి. లేకపోతే ఆ ప్రేమకు అర్థమే లేదు.

ఇంకా చదవండి ...

  బుండి: ప్రేమ పుట్టడానికి కారణం అక్కర్లేదని అంటుంటారు. కానీ పెళ్లి అనే బంధానికి ప్రేమ పునాది లాంటిది. ప్రేమ అనే భావనను పెళ్లి వరకూ తీసుకెళ్లినప్పుడే వాళ్లు నిజమైన ప్రేమికులు. ఎన్ని కష్టనష్టాలను భరించైనా ప్రేమను వివాహం అనే పవిత్ర బంధానికి బాటగా మార్చుకోవాలి. లేకపోతే ఆ ప్రేమకు అర్థమే లేదు. కాలక్షేపానికో, అవసరాలు తీర్చుకోవడానికో ఈ ప్రేమ అనే భావనను నేటి యువతరంలో కొందరు వినియోగించుకుంటున్నారు. ప్రేమ కోసం ప్రాణాలిస్తున్న వారూ ఉన్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్‌లో తాజాగా వెలుగుచూసింది. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని రాజస్థాన్‌లో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లో బుండి పట్టణానికి చెందిన రామ్ సింగ్ ఆరేళ్ల నుంచి ఓ యువతిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆమె ఏది కోరితే అది కాదనకుండా కొనిచ్చాడు. ప్రతీ నెలా ఆ యువతి ఫోన్‌కు రామ్ సింగే రీఛార్జ్ చేయించేవాడు. అంతేకాదు.. ఆమె ఖర్చుల కోసం రూ.15 వేలు ఇచ్చాడు. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టంగానే ఉండేవారు. ఇటీవల.. రామ్ సింగ్ పెళ్లి ప్రతిపాదనను తీసుకొచ్చాడు. కారణమేంటో తెలియదు గానీ అతని పెళ్లి ప్రతిపాదనను ప్రేయసి తిరస్కరించింది. ఇరు కుటుంబాలకు కూడా వీరి ప్రేమ గురించి తెలుసు. పెద్దలు కూడా పెళ్లి చేసేందుకు సుముఖంగానే ఉన్నారు. అయినప్పటికీ రామ్ సింగ్‌ను పెళ్లి చేసుకునేందుకు అతని ప్రియురాలు ‘నో’ చెప్పింది.

  ఈ పరిణామంతో రామ్ సింగ్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఆమెతో సంబంధాన్ని తెంచుకున్నాడు. అయినప్పటికీ ఆమెను పెళ్లి చేసుకుని జీవించాలన్న అతని ఆశ అతనిని స్థిమితంగా ఉండనివ్వలేదు. ఆమెకు ఫోన్ చేశాడు. పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే.. రామ్ సింగ్ ఎంత చెప్పినా అతనిని పెళ్లి చేసుకునేందుకు అతని ప్రేయసి ఒప్పుకోలేదు. దీంతో.. తాను ఎంతగానో ప్రేమించిన యువతి తనను మోసం చేసిందని బాధపడిన రామ్ సింగ్ క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఆమెతో కలిసి బతికే అవకాశం లేనప్పుడు తాను బతికి ఉండటం వ్యర్థమనుకున్నాడు. ఇంట్లో తల్లిదండ్రుల గురించి ఒక్క క్షణం ఆలోచించినా రామ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకునే వాడు కాదు.

  ఇది కూడా చదవండి: Shocking Incident: ‘నా లవర్‌ను నా అంత్యక్రియలకు రానివ్వొద్దు.. ఇదే నా చివరి కోరిక’ అని సూసైడ్ నోట్ రాసి..

  క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టునే సూసైడ్ నోట్ రాసి ఎవరికీ చెప్పకుండా రైలు పట్టాల వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రామ్ సింగ్ మృతదేహానికి దగ్గరలో పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. తాను ప్రాణంగా ప్రేమించిన యువతి తనను మోసం చేసిందని.. పెళ్లికి నిరాకరించిందని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్‌లో రామ్ సింగ్ పేర్కొన్నాడు. తన అన్నయ్య ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడని.. అంతలా ఇష్టపడిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో షాక్‌కు గురయ్యాడని.. ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయిన తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని రామ్ సింగ్ తమ్ముడు లక్ష్మణ్ సింగ్ పేర్కొన్నాడు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదని ఇలా అర్థాంతరంగా తనువు చాలించిన రామ్ సింగ్ కన్నవారికి తీరని కడుపు కోత మిగిల్చి వెళ్లిపోయాడు.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Lover, Lover cheating, Lovers suicide, Rajasthan

  ఉత్తమ కథలు