Home /News /crime /

GIRLFRIEND REACHED HOUSE OF MARRIED BOY SAID I WILL BE WITH YOU LIKE YOUR WIFE LATER HE KILLED HER SK

నీ భార్యతో పాటు నేనూ మీ ఇంట్లోనే ఉంటా.. ప్రియుడి ఇంట్లో ప్రియురాలి రచ్చ.. చివరకు విషాదాంతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నువ్వంటే నాకు ఇష్టమని.. నీ భార్యతో పాటు.. నేను కూడా మీ ఇంట్లోనే ఉంటానని చెప్పింది. తనను కూడా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో బోలోగౌడ్ కోపంతో ఊగిపోయాడు.

    ఈ మధ్య ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. హత్య, అఘాయిత్యాలు న్యూస్‌లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను కూల్చుతున్నాయి. నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో ఘోరం జరిగింది. నీ భార్యతో పాటు మీ ఇంట్లోనే ఉంటాను.. అని వెంటపడుతున్నందుకు.. ప్రియురాలిని ఆమె ప్రియుడు హత్య చేశాడు. మెడకు చీరను బిగించి చంపేసి... చెట్టుకు ఉరేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండగావ్ జిల్లా మక్డీ మండలం హీరాపూర్ గ్రామంలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. ఇది ఒడిశాకు ఆనుకొని ఉంటుంది. చేతిపై ఉన్న టాటూ, వేసుకున్న దుస్తుల ఆధారంగా.. ఆమెను ఒడిశాకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమెకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యాప్తుతో తేలింది.ఈ క్రమంలోనే అతడిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

    Hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున పరువు హత్య.. భార్య కళ్లెదుటే భర్తను చంపేశారు.

    మృతురాలి ప్రియుడి పేరు బోలో గౌడ్. ఒడిశాలోని నవరంగ్‌పూర్ జిల్లా మల్బెడా అతడి స్వస్థలం. బోలోగౌడ్‌కు ఇప్పటికే పెళ్లయింది. కానీ మృతురాలితో వివాహేతర సంబంధం ఉంది. కానీ ఇటీవల అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రియురాలిని వదిలేసి.. భార్యే జీవితంగా బతుకుతున్నాడు. ఇది అతడి ప్రియురాలికి నచ్చలేదు. తనను దూరం పెడుతున్నావంటూ నిలదీసేది. ఈ క్రమంలో సోమవారం నేరుగా బోలోగౌడ్‌ ఇంటికి ఆమె వెళ్లింది. నువ్వంటే నాకు ఇష్టమని.. నీ భార్యతో పాటు.. నేను కూడా మీ ఇంట్లోనే ఉంటానని చెప్పింది. తనను కూడా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో బోలోగౌడ్ కోపంతో ఊగిపోయాడు. తన ప్రియురాలి మెడకు చీరను బిగించి.. హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు.. ఆమె తోటకు మృతదేహాన్ని తీసుకెళ్లి.. మామిడి చెట్టుకు వేలాడదీశాడు.





    అనంతరం నేరుగా ఇంటికి వెళ్లి భార్యకు విషయాన్ని చెప్పాడు. అతడు చెప్పిన మాటలు విన్ని ఆమె షాకయింది. మృతదేహాన్ని చెట్టుకు వేలాదీశానని చెప్పడంతో భయపడిపోయింది. పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని.. ఆ డెడ్‌బాడీని అక్కడి నుంచి తీసేయాలని చెప్పింది. ఆ తర్వాత భార్యాభర్తలతో పాటు అతడి స్నేహితుడు బధు నేతమ్ సాయంతో మృతదేహాన్ని హీరాపూర్ సమీపంలోని అడవి ప్రాంతంలో విసిరేశారు. అనంతరం మృతురాలి మొబైల్ ఫోన్‌ని తమ పొలం సమీపంలోని చెరువులో పడేశాడు. ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. మృతురాలి నుంచి ఎక్కువగా బోలో గౌడ్‌కు కాల్స్ వెళ్లడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. తమదైన స్టైల్లో విచారిస్తే అసలు నిజం చెప్పేశాడు. పోలీసులు బోలోగౌడ్, అతడి భార్య, స్నేహితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Chhattisgarh, Crime, Crime news, Odisha

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు