Home /News /crime /

GIRLFRIEND HEIGHT WAS LOW JUST BECAUSE OF THIS SHE WAS PUT TO DEATH INCIDENT HAPPEND IN JHARKHAND SSR

Lovers: ప్రేమించిన అమ్మాయి పొట్టిగా ఉందని.. లవ్ చేసినప్పుడు లేని హైట్ ప్రాబ్లం తర్వాత ఎందుకొచ్చిందంటే..

పోలీసుల అదుపులో నిందితుడు

పోలీసుల అదుపులో నిందితుడు

జార్ఖండ్‌లోని ఖుంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 20 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ఆమెను చంపింది ప్రియుడే కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుందు దర్హాతోలి గ్రామానికి చెందిన అజిత్, అంజలి కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు.

ఇంకా చదవండి ...
    ఖుంటి: జార్ఖండ్‌లోని ఖుంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 20 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ఆమెను చంపింది ప్రియుడే కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుందు దర్హాతోలి గ్రామానికి చెందిన అజిత్, అంజలి కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. వీళ్లిద్దరి ప్రేమ గురించి గ్రామంలో చాలామందికి తెలుసు. అజిత్ స్నేహితులకు అందరికీ తెలుసు. అంజలి చూడటానికి పొట్టిగా ఉంటుంది.

    పొట్టి అమ్మాయిని ప్రేమించావని అజిత్‌ను తోటి స్నేహితులు గేలి చేసేవారు. ఈ నేపథ్యంలో అజిత్ కొన్నాళ్ల నుంచి తన ప్రియురాలు పొట్టిగా ఉందని బాధపడుతుండేవాడు. ఈ క్రమంలోనే.. అంజలి పెళ్లి చేసుకోవాలని అజిత్‌పై ఒత్తిడి తెచ్చింది. పెళ్లి చేసుకోవాలని అంజలి అడుగుతున్న విషయం తెలిసి అజిత్ స్నేహితులు మరింత రెచ్చిపోయారు. ‘ఆ పొట్టి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా.. చేసుకో’ అంటూ వెటకారంగా సెటైర్లు, జోకులు వేశారు. ఈ పరిణామాలతో అజిత్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు.

    ఇది కూడా చదవండి: Viral Video: మరో మహిళ మోజులో తండ్రి.. కూతుర్లేం చేశారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో..

    ఆమె హైట్ విషయంలో ఎన్నో మాటలు పడాల్సి వస్తోందని.. ఆమెతో ప్రేమను కొనసాగించే విషయంలో కొన్ని రోజులుగా అజిత్ మల్లగుల్లాలు పడుతున్నాడు. ఇటీవల ఒకరోజు అజిత్ గ్రామానికి దగ్గర్లోని అడవిలోకి రమ్మని అంజలికి చెప్పాడు. ఇద్దరూ ఆ అడవిలో చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోరని.. ఇద్దరం కలిసి ఇళ్లు వదిలి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని అంజలికి చెప్పాడు. ఆమె కూడా అంగీకరించడంతో ఇద్దరూ కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అంజలి బట్టలు సర్దుకుని అజిత్ చెప్పినట్లు ఎవరికీ కనిపించకుండా అడవిలో వేచి చూస్తున్న ప్రియుడి దగ్గరకు వచ్చింది. కానీ.. అజిత్ అప్పుడే తనలోని మృగాన్ని నిద్రలేపాడు. ఆమెతో పెళ్లి ఇష్టం లేని అజిత్ ఆమెను చంపేందుకు అక్కడికి రమ్మన్నాడు. ఆమె తెచ్చిన బట్టలను కాల్చి బూడిద చేశాడు.

    ఇది కూడా చదవండి: Strange: పెళ్లాడిన భార్య నోటి వెంట ఆమె ప్రియుడి పేరు విన్న భర్త.. ఏం చేశాడో ఊహించలేరు..

    ఇలా ఎందుకు చేశావని ఆమె అడగ్గా.. కొత్త బట్టలు కొనుక్కుందామని, ఇవి తీసుకెళ్లడం మంచిది కాదని చెప్పాడు. ఆ బట్టలను కాల్చేసిన తర్వాత తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో అంజలి గొంతుపై వేటు వేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అంజలి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత అజిత్ స్పాట్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. అడవిలో ఓ యువతి మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందడంతో స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. హత్యగా తేల్చిన పోలీసులు గ్రామంలో విచారించగా అజిత్‌తో అంజలి ప్రేమలో ఉందని పోలీసులకు తెలిసింది. ఎట్టకేలకు పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. తన స్నేహితులు, అంజలితో తన ప్రేమ గురించి తెలిసిన వాళ్లంతా పొట్టి అమ్మాయిని ప్రేమించావని వెక్కిరించారని.. ఆ అవమానం తట్టుకోలేక బాధపడుతున్న సమయంలో అంజలి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఈ హత్య చేసినట్లు అజిత్ చెప్పాడు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Brutally murder, Crime news, Girlfriend, Lovers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు