హోమ్ /వార్తలు /క్రైమ్ /

తనను ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని.. రాత్రి ప్రియుడింటికి వెళ్లి...

తనను ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని.. రాత్రి ప్రియుడింటికి వెళ్లి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొద్దికాలంగా వారు చెట్లనక, పుట్లనక తెగ తిరిగారు. ఒకరిని విడిచి ఒకరు ఉండనంతగా ప్రేమించుకున్నారు. నీవు తప్పితే వేరే ప్రపంచమే లేదన్నాడు ప్రియుడు. నా పిల్లలకు తండ్రి నూవే అంది ప్రియురాలు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంతలో ఊహించని కుదుపు..

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

‘నాకు దక్కనిది వేరేవాళ్లకు దక్కడానికి వీళ్లేదు. దక్కనివ్వను...’  ముక్కోణ ప్రేమకథలతో తెరకెక్కించే ప్రతి తెలుగు సినిమాలో వినిపించే డైలాగ్ ఇది. దానికోసం సదరు బాధిత హీరో గానీ.. హీరోయిన్ గానీ.. విలన్ గానీ వారి విరహ వేదనను తట్టుకోలేక ప్రేమించిన వాళ్లనో.. లేక వాళ్లు పెళ్లి చేసుకున్నవాళ్లనో హత్య చేయడం చాలా సినిమాల్లో చూశాం. స్వచ్ఛమైన ప్రేమ అంటే మనం ప్రేమించిన వారిని సంతోషంగా ఉంచడమే అని నీతులు చెబితే వాళ్లు ఒప్పుకోరు. ప్రేక్షకులైతే అస్సలు కన్విన్స్ అవ్వరు. అబ్బే.. తమిళ సినిమా సుద్దులు మాకొద్దు బాబోయ్ అంటారు. అలాగే అనుకుందేమో బీహార్ కు చెందిన ఒక ప్రేమికురాలు. తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు గానూ ప్రతీకారం తీర్చుకుంది.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. నలంద జిల్లా మోరా తాలాబ్ గ్రామానికి చెందిన యువతి.. గోపాల్ రామ్ అనే యువకుడని ప్రేమించింది. కొద్దికాలంగా వారు చెట్లనక, పుట్లనక తెగ తిరిగారు. ఒకరిని విడిచి ఒకరు ఉండనంతగా ప్రేమించుకున్నారు. నీవు తప్పితే వేరే ప్రపంచమే లేదన్నాడు గోపాల్ రామ్. నా పిల్లలకు తండ్రి నూవే అంది సదరు యువతి. అంతా బాగానే ఉంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంతలో ఊహించని కుదుపు. ఈ నెల 1 న గోపాల్ రామ్.. మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇది చూసిన సదరు ప్రేమికురాలు.. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ మాదిరి రగిలిపోయింది.

పంచ భూతాల సాక్షిగా తామిద్దరం ప్రేమించుకుంటే.. ఈమె మధ్యలో వచ్చి నోటికందిన కూడును లాక్కెళ్లినట్టు తన్నుకుపోయిందని మదనపడింది. తన అడ్డు తొలగించుకుని.. తిరిగి ఆ ప్రేమికుడి ప్రేమను పొందాలనుకుంది. అనుకున్నదే తడువుగా.. అదే రాత్రి ప్రియుడి ఇంటికెళ్లింది. అందరూ పడుకున్నాక.. ప్రియుడు పెళ్లి చేసుకున్న భార్య బెడ్ రూంలో కి అడుగుపెట్టింది. వచ్చేప్పుడు వెంట తెచ్చుకున్న కత్తెరతో ఆమె జుట్టు కత్తిరించింది. ఇది చూసిన బాధితురాలు అరవడం మొదలుపెట్టింది. ఆమె గొంతును గట్టిగా నొక్కి.. కళ్లలో ఫెవిస్టిక్ పోసింది. కనురెప్పలను ఫెవిస్టిక్ తో అంటించింది. దీంతో బాధితురాలు మంటకు తాళలేక లబోదిబోమని మొత్తుకుంది.

బాధితురాలి అరుపులు విన్న కుటుంబసభ్యులు వెంటనే ఆమె గదికి చేరుకున్నారు. నిందితురాలిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి నిలదీశారు. పలువురు ఆమెపై భౌతిక దాడికి దిగారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు.

అయితే విచారణ సందర్భంగా.. ఆ యువతి స్పందిస్తూ.. తాను, గోపాల్ గాఢంగా ప్రేమించుకున్నామని, కానీ అతడు తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది.

ఇదిలాఉండగా.. ఫెవిస్టిక్ పోయడంతో గోపాల్ భార్య ఒక కన్నుకు సమస్య ఏర్పడిందని.. బహుశా ఆమె చూపు కోల్పోయే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు.

First published:

Tags: Bihar, Crime, Crime news, Crime story, Love, Love affiar, Murder attempt

ఉత్తమ కథలు