GIRLFRIEND ATTACKED ON LOVER CAR WITH PETROL BOMB AFTER HE REFUSED TO MARRY HER IN CHENNAI FULL DETAILS HERE HSN
ప్లీజ్.. నన్ను రెండో పెళ్లయినా చేసుకోమని కోరిన యువతి.. నో చెప్పిన ప్రియుడు.. ఆ భగ్న ప్రేమికురాలు ఎంతకు తెగించిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
ఇటీవలే ప్రవీణ్ విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. మరో యువతిని అతడు పెళ్లి చేసుకుంటున్నాడని జెస్సికాకు సమాచారం అందింది. దీంతో ప్రవీణ్ ను నేరుగా కలిసింది. తనకు అన్యాయం చేయొద్దని కోరింది. కనీసం రెండో పెళ్లిగా అయినా తనను చేసుకోమని వేడుకుంది. అయితే..
క్షణికావేశంలో యువత ఘోరాలకు తెగిస్తోంది. భర్తను భార్య మోసం చేసిన కారణం వల్లనో, భార్యే భర్తను మోసం చేసిన కారణం వల్లనో ఏదో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక కాలేజీ యూత్ విషయం అయితే వేరే చెప్పనవసరం లేదు. ఇటీవలే గుంటూరులో ఓ యువతిని తన తోటి విద్యార్థే అతి కిరాతకంగా హత్య చేశాడు. ప్రేమించిన అమ్మాయి తనకు దూరంగా ఉంటోందన్న కక్షతో ఆమెను హతమార్చాడు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే దాడికి పాల్పడింది మాత్రం అబ్బాయి కాదు, అమ్మాయే. అవును, ఓ భగ్నప్రేమికురాలు తన ప్రియుడిపై దాడి చేసింది. ప్రేమించానని మాటలు చెప్పి తప్పించుకని తిరుగుతున్న ప్రియుడిపై కోపం పెంచుకుంది. వేరే యువతితో పెళ్లికి రెడీ అయ్యాడని తెలిసి కుమిలిపోయింది.కనీసం రెండో పెళ్లి అయినా చేసుకోమని కోరింది. అతడు ససేమిరా అనడంతో చివరకు ఘోరానికి తెగించింది. ఇంతకీ అసలు కథేంటంటే..
తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా నెల్లూరుకుచెందిన ప్రవీణ్ అనే 38ఏళ్ల వ్యక్తి, తిరుచ్చెందూరు కాలేజీలో చదువుకునే రోజుల్లో జెస్సికా అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ చాలా కాలం ప్రేమించుకున్నారు. కలిసి సిటీల్లో పార్కుల్లోనూ, సినిమా థియేటర్లలోనూ షికార్లు కొట్టారు. అయితే అతడికి విదేశాల్లో ఉద్యోగం రావడంతో ప్రవీణ్ వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగొచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. విదేశాలకు వెళ్లిన తర్వాత ప్రవీణ్ ఆమెకు ఫోన్ చేయడం కూడా మానేశాడు. దీంతో తనను మోసం చేస్తున్నాడని జెస్సికాకు అర్థమయింది. ఇటీవలే ప్రవీణ్ విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. మరో యువతిని అతడు పెళ్లి చేసుకుంటున్నాడని జెస్సికాకు సమాచారం అందింది.
దీంతో ప్రవీణ్ ను నేరుగా కలిసింది. తనకు అన్యాయం చేయొద్దని కోరింది. కనీసం రెండో పెళ్లిగా అయినా తనను చేసుకోమని వేడుకుంది. అయితే ఆమె ప్రతిపాదనలకు, విన్నపాలకు ప్రవీణ్ గుండె కరగలేదు. ససేమిరా అన్నాడు. దీంతో జెస్సికాలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతడి వద్ద నుంచి తిరిగి ఇంటికి వచ్చిన జెస్సికా, తనకు తెలిసిన స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్ వేసింది. శుక్రవారం రాత్రి కారులో ప్రవీణ్ బయటకు వెళ్తుండగా తన స్నేహితులతో కలిసి అతడి కారును వెంబడించింది. ప్రవీణ్ కారుపై పెట్రోల్ బాంబు విసిరి అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనలో ప్రవీణ్ కారు పూర్తిగా కాలిపోయింది. అయితే ప్రవీణ్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ప్రవీణ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జెస్సికాపై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.