Home /News /crime /

GIRLFRIEND ARRIVED IN LOVER MARRIAGE WITH BAND INCIDENT HAPPEND IN UP GORAKHPUR SSR

Lover: ‘నన్ను వాడుకుని.. ఈమెతో పెళ్లా’.. మోనపోరాటాలు దండగనుకుని మోత మోగించిన లవర్..!

మరో యువతితో పెళ్లికి సిద్ధపడిన సందీప్, ఇన్‌సెట్‌లో బాధిత యువతి

మరో యువతితో పెళ్లికి సిద్ధపడిన సందీప్, ఇన్‌సెట్‌లో బాధిత యువతి

ప్రేమ పేరుతో తనను మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధపడిన యువకుడికి ప్రేయసి ఊహించని షాకిచ్చింది. మౌన పోరాటాలు, దీక్షలతో ఒరిగేదేమీ లేదని అనుకున్న ఆమె.. పెళ్లి సందడితో కళకళలాడుతున్న ప్రియుడి ఇంటికి బ్యాండ్ బృందాన్ని వెంటబెట్టుకుని బ్యాండ్ మోగించుకుంటూ బయల్దేరింది. ‘నీ పెళ్లికి నేను బ్యాండ్‌బాజా మోగిస్తా’ అన్నట్టుగా వెళ్లిన ఆమెను చూసి ఆ యువకుడు షాకయ్యాడు.

ఇంకా చదవండి ...
  గోరక్‌పూర్: ప్రేమ పేరుతో తనను మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధపడిన యువకుడికి ప్రేయసి ఊహించని షాకిచ్చింది. మౌన పోరాటాలు, దీక్షలతో ఒరిగేదేమీ లేదని అనుకున్న ఆమె.. పెళ్లి సందడితో కళకళలాడుతున్న ప్రియుడి ఇంటికి బ్యాండ్ బృందాన్ని వెంటబెట్టుకుని బ్యాండ్ మోగించుకుంటూ బయల్దేరింది. ‘నీ పెళ్లికి నేను బ్యాండ్‌బాజా మోగిస్తా’ అన్నట్టుగా వెళ్లిన ఆమెను చూసి ఆ యువకుడు షాకయ్యాడు. ఈ ఘటన యూపీలోని గోరక్‌పూర్‌లో జరిగింది. అంతేకాదు.. ఆ ఊర్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రియుడి ఇంటికి చేరే వరకూ బ్యాండ్ మోగించడంతో స్థానికులంతా ఏం జరిగిందోనని చూస్తున్నారు. వాళ్లంతా అలా ఆసక్తిగా చూస్తుండగా ఆ యువతి అసలు విషయం బయటపెట్టేసింది. సందీప్ మౌర్య అనే ఈ యువకుడితో తనకు రెండేళ్ల క్రితం బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌లో పరిచయం ఏర్పడిందని ఆ యువతి పేర్కొంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని.. రెండు కుటుంబాలకు తమ ప్రేమ విషయం కూడా తెలిసిందని ఆ యువతి చెప్పింది. ఒకే కులం కావడం, ఇద్దరూ వరసైన వాళ్లే కావడంతో వాళ్లు కూడా అడ్డు చెప్పలేదని.. దీంతో ఇద్దరి మధ్య చనువు మరింత పెరిగిందని ఆ యువతి తెలిపింది. దాదాపు రెండేళ్లుగా ఇద్దరం కలిసి తిరిగామని, ఆ యువకుడి ఇంటికి తాను.. తన ఇంటికి సందీప్ మౌర్య కూడా తరచుగా వస్తుండేవాడని.. ఈ క్రమంలోనే పలుమార్లు శారీరకంగా కూడా కలిసినట్లు ఆ యువతి తెలిపింది. అయితే.. కొన్ని రోజులుగా ఏమైందో ఏమో తెలియలేదు గానీ సందీప్ తనను కలవడమే మానేశాడని.. ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని, తనను కలిసేందుకు ఇంటికి వెళితే ఆ సమయంలో ఇంట్లో ఉండకుండా ఎక్కడికో వెళ్లిపోయేవాడని బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలోనే.. తనతో సందీప్ ప్రేమలో ఉన్న విషయం తెలిసి కూడా అతని కుటుంబం మరో యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారని.. అంతా కలిసి తనను అన్యాయం చేయాలని చూశారని ఆమె వాపోయింది. ఆ యువకుడు తనను ఉపయోగించుకుని శారీరక అవసరాలు తీర్చుకున్నాడన్న విషయాన్ని ఆ యువతి ఊరందరి ముందు కేకలేసి మరీ చెప్పడం గమనార్హం. పెళ్లి చేసుకుంటావన్న నమ్మకంతోనే శారీరకంగా కలిసేందుకు అంగీకరించానని.. అలాంటి తనను కాదని మరో అమ్మాయితో పెళ్లికి ఎలా సిద్ధపడ్డావని ఆ యువతి సందీప్‌ను నిలదీసింది.

  ‘వాడికి ఎలాగూ బుద్ధి లేదు.. కనీసం తల్లిదండ్రులైన మీకైనా బుద్ధుండక్కర్లేదా.. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసి విషయం తెలిసి కూడా మరో అమ్మాయి గొంతుకోసేందుకు ఎలా సిద్ధపడతారు’ అని సందీప్ తల్లిదండ్రులకు కూడా బాధిత యువతి గడ్డి పెట్టింది. బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా ఆమెకు మద్దతుగా నిలవడంతో ఏం చేయాలో పాలుపోని సందీప్ కుటుంబం తమ ఇంటి ముందుకు వచ్చి ఓ అమ్మాయి, ఆమె బంధువులు రచ్చ చేస్తున్నారని పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

  ఇది కూడా చదవండి: ‘నీ రూంలో ఏసీ లేదుగా.. నా రూంకు రా’.. కూతురి వయసున్న స్టూడెంట్‌తో వెకిలి మాటలు.. ఆడియో వైరల్..

  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఇరు పక్షాల వాదనలు విన్నారు. ఆ యువతికి నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. అయితే.. అందుకు ఆ యువతి ససేమిరా అనడమే కాక.. పెళ్లి జరిగితే తనతోనే జరగాలని.. లేకపోతే ఫ్యామిలీ మొత్తం జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆ యువతి సందీప్‌ను హెచ్చరించింది. పోలీసులకు సందీప్ మౌర్యపై ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారమంతా చూసిన పెళ్లి కూతురు, ఆమె కుటుంబం అవాక్కయ్యారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Gorakhpur, Love, Lovers, Marriage, Uttarpradesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు