కోచింగ్ సెంటర్‌లో యువతికి మత్తు మందు ఇచ్చి...ట్యూటర్ వికృత చేష్టలు..

గత వారం కోచింగ్ ఇనిస్టిట్యూట్ లో విద్యార్థులందరికీ పార్టీ ఇస్తున్నానని ట్యూటర్ ప్రకటించగా, విద్యార్థులంతా హాజరయ్యారు. అయితే కుటిల ఆలోచనతో ఉన్న ట్యూటర్ బాధిత యువతికి జ్యూస్‌లో మత్తు మందు కలిపి సర్వ్ చేశాడు.

news18-telugu
Updated: November 4, 2019, 6:44 PM IST
కోచింగ్ సెంటర్‌లో యువతికి మత్తు మందు ఇచ్చి...ట్యూటర్ వికృత చేష్టలు..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా మారి విద్యార్థినిపై తన పశువాంఛ తీర్చుకోవాలని చూశాడు. వివరాల్లోకి వెళితే బీహార్ లోని చంపారన్ జిల్లాలో నిందితుడు మోహన్ ( పేరు మార్పు) ఒక కోచింగ్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్నాడు. అయితే అదే ఇనిస్టిట్యూట్ లో విద్యార్థినిగా బాధిత యువతి చేరింది. మోహన్ తన వద్దకు వచ్చే విద్యార్థినులతో కాస్త చనువుగా ఉండేవాడు. అయితే అదే అదనుగా భావించి విద్యార్థినులతో ద్వంద్వార్థ మాటలు మాట్లాడేవాడు. తన వలలో ఎవరు పడతారా అని ఎదురుచూసేవాడు. ఈ క్రమంలోనే బాధిత యువతిపై ఆ ట్యూటర్ కన్ను పడింది. గత వారం కోచింగ్ ఇనిస్టిట్యూట్ లో విద్యార్థులందరికీ పార్టీ ఇస్తున్నానని ట్యూటర్ ప్రకటించగా, విద్యార్థులంతా హాజరయ్యారు. అయితే కుటిల ఆలోచనతో ఉన్న ట్యూటర్ బాధిత యువతికి జ్యూస్‌లో మత్తు మందు కలిపి సర్వ్ చేశాడు.

కాగా విద్యార్థులంతా వెళ్లిపోయాక బాధిత యువతిని గదిలోకి తీసుకెళ్లి ఆమెపై ట్యూటర్ లైంగిక దాడి జరిపాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధిత యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది.

First published: November 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...